Tigers rescued by villagers: మానవత్వం మంట గలవడం అంటే ఇదే. దప్పిక తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చిన రెండు పులి పిల్లలపై రాళ్లతో గ్రామస్తులు దాడి చేశారు. మధ్యప్రదేశ్ లోని సియోనిలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పులి కూనలు చాలా ప్రయత్నించాయి. అయితే వాటిని వెంటాడి రాళ్లతో దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. మధ్యప్రదేశ్ లోని కన్హా టైగర్ రిజర్వ్ నుంచి ఈ పులిపిల్లలు నీళ్ల కోసం బయటకొచ్చాయి. సియోనిలో కాలువ దగ్గర నీళ్లు తాగుతుండగా గ్రామస్తులు దాడి చేశారు. గాయపడ్డ రెండు పులి పిల్లలకు అటవీశాఖ సిబ్బంది , పోలీసులురక్షించారు. ముక్కీ లోని వైల్డ్ లైఫ్ ఆస్పత్రికి ట్రీట్‌మెంట్ కోసం తరలించారు. ఆపదలో ఉన్న పులి పిల్లలను రక్షించాల్సిన గ్రామస్తులు ఇలా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. కొంతమంది పులి పిల్లలను పట్టుకోండి.. అని అరుస్తుంటే.. మరికొంతమంది రాళ్లతో కొట్టండి అరవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. గ్రామస్తుల రాళ్ల దాడిని కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
This is Sick!Villagers pelted stones and injured tiger cubs in Seoni dist of MadhyaPradesh.The cubs were at a pond to quench their thirst when this inhuman act happened. @CMMadhyaPradesh action must be taken against all those involved. @RandeepHooda @byadavbjp @rameshpandeyifs pic.twitter.com/lKNoeLQRaD
— Forests And Wildlife Protection Society-FAWPS (@FawpsIndia) May 18, 2022
కాగా.. దేశంలో పులుల సంఖ్య వేగంగా తగ్గుతోంది. పులులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కాని కొంతమంది ప్రబుద్దులు వన్యప్రాణుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పులి పిల్లలకు ప్రాణహానీ ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు , ఫారెస్ట్ అధికారులు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీలు , రాళ్లతో పులి పిల్లలపై దాడి చేస్తున్న గ్రామస్తులను చెదరగొట్టారు. దీంతో పులి కూనల ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్న జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..