కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మృతి

ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచిస్తున్నప్పటికీ.. పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరోనా బారినపడుతున్నారు.

కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మృతి

Updated on: Jun 19, 2020 | 1:24 PM

ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచిస్తున్నప్పటికీ.. పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా.. జమ్ముకశ్మీర్‌లో కరోనా బారినపడ్డ ఓ వ్యక్తి ఒకరు మరణించారు. అయితే అతని అంత్యక్రియలకు హాజరైన వ్యక్తుల్లో.. ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. దీంతో ఇప్పుడు ఆ కరోనా రోగి అంత్యక్రియల్లో హాజరైన వారంతా టెన్షన్ పడుతున్నారు. సదరు వ్యక్తులు కూడా కరోనా బారినపడి మరణించారా..? లేదా సహజంగానే మరణించారా..? అన్నది తెలియక భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనపై జమ్ము మేజిస్ట్రేట్‌ సీరియస్ అయ్యింది. మృతులిద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది. దీంతో అధికారులు ప్రత్యేక వైద్య సిబ్బందితో మృతులకు కరోనా పరీక్షలు చేసేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన రిపోర్టులను జూన్ 22వ తేదీలోగా సమర్పించాలని మేజిస్ట్రేట్ సదరు అధికారులకు ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా టెస్టులు చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు.. ముందు జాగ్రత్తగా.. కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న వారి కాంటాక్ట్స్ కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us