Kerala rainfall, floods: కేరళలో వర్ష బీభత్సం, 18 మంది మృతి.. 22మంది గల్లంతు. శబరిమల దర్శనం రద్దు

|

Oct 17, 2021 | 9:48 AM

1 / 5
కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటినుంచి ఏకధాటి వర్షాలకు కేరళ వణికిపోతోంది. కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. వర్షాల ధాటికి ఆరుగురు మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారు. 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ.  కొట్టాయంలో విరిగిపడ్డ కొండ చరియల దృశ్యాలు

2 / 5
పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్‌, పాలక్కడ్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కొట్టాయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళలో 6 జిల్లాల్లో రెడ్‌అలెర్ట్‌ ప్రకటించారు.

3 / 5
ఇవాళ, రేపు శబరిమలలో దర్శనం రద్దు..  భక్తులు రావొద్దన్న ట్రావెన్‌కోర్‌ బోర్డు

4 / 5
ఇడుక్కిలో వరద విలయం సృష్టిస్తోంది. వరద ఉధృతికి 15మంది గల్లంతయ్యారు. ప్రాజెక్టుల పరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వర్షాలు, వరదల విధ్వంసంలో రెండ్రోజుల పాటు శబరిమల దర్శనాన్ని దర్శనం చేశారు.

5 / 5
మరోవైపు రాష్ట్రంలోని వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్‌ సమీక్ష నిర్వహించారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 11 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించింది NDRF.