Watch: ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. నీట మునిగిన స్కూల్‌ బిల్డింగ్..162 మంది విద్యార్థుల పరిస్థితి..!

దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను తొలుత భవనంపైకి తరలించారు. అనంతరం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న రెస్య్యూ బృందాలు గ్రామస్థుల సహాయంతో విద్యార్థులను రక్షించాయి. హల్దిపోఖర్-కోవాలి రోడ్డులోని పండర్సోలి వద్ద ఉన్న పాఠశాలలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. పాఠశాల భవనం నీట మునిగిపోవడంతో, ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ పైకప్పులపైకి తరలించారు.

Watch: ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. నీట మునిగిన స్కూల్‌ బిల్డింగ్..162 మంది విద్యార్థుల పరిస్థితి..!
Heavy Floods In Jharkhand

Updated on: Jun 30, 2025 | 12:17 PM

జార్ఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో ఝార్ఖండ్‌ తూర్పు సింగ్భూమ్‌ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరద కారణంతో ఒక ప్రైవేటు పాఠశాల ప్రాంగణం నీట మునిగింది. మొత్తం 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను తొలుత భవనంపైకి తరలించారు. అనంతరం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న రెస్య్యూ బృందాలు గ్రామస్థుల సహాయంతో విద్యార్థులను రక్షించాయి. హల్దిపోఖర్-కోవాలి రోడ్డులోని పండర్సోలి వద్ద ఉన్న పాఠశాలలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. పాఠశాల భవనం నీట మునిగిపోవడంతో, ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ పైకప్పులపైకి తరలించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

భారీ వర్షాల నేపథ్యంలో జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 30న ఖుంటి, రాంచీ, రామ్‌గఢ్, బొకారో, ధన్‌బాద్, సరైకేలా-ఖర్స్వాన్, వెస్ట్ సింగ్‌భూమ్‌లకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయబడింది. జూలై 1న గుమ్లా, గర్వా, పాలము, చత్రా, లతేహర్, లోహర్‌దాగాలకు జారీ చేయబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..