Viral: కూలీలు ఇసుక తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యం..

జమ్మూ కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో జహ్లం నదిలో ఇసుక తవ్వకాల్లో భాగంగా లభించిన 10వ శతాబ్దపు పురాతన శివలింగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుతం దీనిని శ్రీనగర్ ఎస్పీఎస్‌ మ్యూజియంలో సంరక్షిస్తున్నారు. పూర్తి డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ..

Viral: కూలీలు ఇసుక తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యం..
Sand

Updated on: Aug 04, 2025 | 3:03 PM

జమ్మూ కాశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లాలో జహ్లం నదీ తీరంలో ఓ అరుదైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. బారాముల్లా ఖాన్‌పోరా వద్ద ఆర్మీ క్యాంప్‌ సమీపంలో స్థానిక కార్మికులు ఇసుక తవ్వకాలు జరుపుతుండగా… ప్రాచీన శివలింగాన్ని కనుగొన్నారు. ఈ శివలింగం 10వ శతాబ్దానికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు. దీని పొడవు 137 సెంటీమీటర్లు కాగా, వెడల్పు 160 సెంటీమీటర్లుగా ఉంది. ఈ అరుదైన శిల్పకళా సంపదను బారాముల్లాలోని ఇండియన్ ఆర్మీ 22 మిడియం రెజిమెంట్‌ తమ సంరక్షణలోకి తీసుకుంది. అనంతరం ఆ శివలింగాన్ని జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వంలోని ఆర్కైవ్స్‌, ఆర్కియాలజీ & మ్యూజియమ్స్‌ విభాగానికి అప్పగించారు. అక్కడి నుంచి దీనిని శ్రీనగర్‌లోని ఎస్పీఎస్‌ మ్యూజియానికి తరలించి.. శాస్త్రీయంగా సంరక్షిస్తున్నారు. త్వరలోనే దీనిని ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచనున్నారు.

ఇంత ప్రాచీన శివలింగం బయటపడటాన్ని రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ఉదాహరణగా చెబుతున్నారు. “ఈ శివలింగం లభ్యత మన పరంపరకు, ప్రాచీనతకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఇటువంటి అద్భుత సంపదలను జాగ్రత్తగా సంరక్షించడం, ప్రజలకు తెలియజేయడం మేం బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇది కేవలం ఆధ్యాత్మికతే కాదు, శాస్త్రీయంగా కూడా ఎంతో విలువైన విషయం” అని ఆర్కియాలజీ, మ్యూజియమ్స్‌ డైరెక్టర్‌ కుల్దీప్ కృష్ణ సిద్ధా చెప్పుకొచ్చారు.

Ancient Stone Shivling

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..