
సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి హైలెట్‌గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య నిమిషాల వ్యవధిలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 1.1 మిలియన్ల ఫాలోవర్లు మోదీ ఖాతాకు పెరగడం డిజిటల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ ఘటనలు చిన్న విషయాలు కావని, అవి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన అంశాలని అందులో మోదీ తెలిపారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ వీడియో అప్‌లోడ్ చేయకముందు ప్రధాని మోదీ ఫాలోవర్స్ 101 మిలియన్స్ ఉన్నారు. ఈ వీడియో అప్‌లోడ్ తర్వాత ఆ సంఖ్య 102 మిలియన్స్‌కు చేరడం గమనార్హం. ప్రధాని మోదీకి ఉన్న అంతర్జాతీయ క్రేజ్, దేశీయంగా ఆయనకున్న ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో ఈ ఫాలోవర్ల పెరుగుదల స్పష్టం చేస్తోంది. గడిచిన కొద్ది గంటల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్లు పెరగడంపై పలువురు డిజిటల్ విశ్లేషకులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలో అవుతున్న అధికారంలో ఉన్న ఏకైక ప్రపంచ నేతగా రికార్డు సృష్టించారు. మోదీ ఇప్పటికే 100 మిలియన్లకు పైగా ఫాలోవర్ల అరుదైన మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా మాజీ లేదా ప్రస్తుత అధ్యక్షులు, యూకే ప్రధానులు, ఇతర గ్లోబల్ లీడర్ల కంటే ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది.
He gained 1.1M followers in 12hrs 😭😭😭 pic.twitter.com/VMLOJiJNej
— Vestige¹⁸ (@SanatanEdge) July 24, 2026