శ్యామ్‌ సింగ రాయ్‌: 65 ఏళ్ల వృద్ధుడిగా నాని..!

టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో నాని నటించనున్న చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. కోల్‌కతా నేపథ్యంలో వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా

  • Manju Sandulo
  • Publish Date - 1:42 pm, Tue, 27 October 20

Nani Shyam Singha Roy: టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో నాని నటించనున్న చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. కోల్‌కతా నేపథ్యంలో వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. ఇందులో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో నాని త్రిపాత్రాభినయంలో నటించనున్నారని.. అందులో ఒకటి 65ఏళ్ల ముసలాడి పాత్ర అని సమాచారం. విలక్షణ పాత్రలు చేయడంలో ముందుండే నాని.. జెర్సీలో ఇప్పటికే ఓ బిడ్డ తండ్రిగా నటించారు. ఇక ఇప్పుడు ముసలివాడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మరో కొత్త అవతారంలో నానిని చూడొచ్చు.

కాగా ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీష్‌లో నటిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానితో జోడీ కడుతున్నారు. షైన్ స్క్రీన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read more:

ట్రాక్టర్ ప్రమాదం.. నారా లోకేష్‌పై కేసు నమోదు

Official:’పెళ్లి సందD’లో రోషన్‌.. శ్రీకాంత్‌ని గుర్తుచేస్తోన్న వారసుడు