ట్రాక్టర్ ప్రమాదం.. నారా లోకేష్‌పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే.

  • Manju Sandulo
  • Publish Date - 1:10 pm, Tue, 27 October 20

Case against Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా లోకేశ్‌ ట్రాక్టర్‌ నడుపుతుండగా.. అది కాల్వ వైపు ఒరిగింది. వెంటనే లోకేష్‌ పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ట్రాక్టర్‌ను కంట్రోల్‌ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్ నడుపుతూ ఈ ఘటనకు కారణమైనందుకు ఆయనపై కేసు నమోదైంది. అలాగే కోవిడ్‌ 19 నిబంధనలను లోకేష్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పొందపరిచారు. ఈ క్రమంలో 279, 184, 54A కింద ఆకివీడు పోలీసులు లోకేష్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు కక్షచర్యల్లో భాగంగానే లోకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read More:

Official:’పెళ్లి సందD’లో రోషన్‌.. శ్రీకాంత్‌ని గుర్తుచేస్తోన్న వారసుడు

రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్‌