టీటీడీ బోర్డు సభ్యుడిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

Jupally Rameswar Rao takes oath as TTD board member, టీటీడీ బోర్డు సభ్యుడిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా మై హోం గ్రూపు వ్యాపార సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ బోర్డులో స్థానం కల్పించిన ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. చినజీయర్ స్వామి అనుగ్రహంతోనే టీటీడీ సభ్యుడినయ్యానని.. సామాన్య భక్తులకు సేవ చేసే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. కాగా ఇవాళ టీటీడీ పాలకమండలి తొలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా.. పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వారు చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *