‘బడుగు కార్మికులకు’ వేతనాల చెల్లింపు ఇలా..?

ప్రధాని మోదీ ప్రకటించిన  20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన 'లెక్కల' కసరత్తు మొదలైంది. ఈ భారీ ప్యాకేజీలోని ఆయా మొత్తాలను ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది...

'బడుగు కార్మికులకు' వేతనాల చెల్లింపు ఇలా..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 13, 2020 | 1:20 PM

ప్రధాని మోదీ ప్రకటించిన  20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన ‘లెక్కల’ కసరత్తు మొదలైంది. ఈ భారీ ప్యాకేజీలోని ఆయా మొత్తాలను ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, సిబ్బందికి, అలాగే చిన్నా, చితకా వ్యాపారులకు 3 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆ క్రమంలో వీరికి రాష్ట్ర ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి వేతనాలు చెల్లించాలన్న యోచన కూడా ఉన్నట్టు తెలియవచ్చింది. భారత జీడీపీలో 10 శాతానికి సమానంగా ఉన్నట్టు చెబుతున్న ఇరవై లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలో ఈ మూడు లక్షల కోట్లు కూడా చేరి ఉంటాయని భావిస్తున్నారు. అలాగే ఈ ‘బడుగు పరిశ్రమలకు’ సంబంధించి వీటి  రుణాల తిరిగి చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం ప్రకటించాలన్న ప్రతిపాదన సైతం ఉన్నట్టు సమాచారం. అర్హత ఉన్న ప్రతి చిన్న తరహా పరిశ్రమ కూడా 20 శాతం అదనపు రుణం పొందవచ్చు. ఏమైనా.. ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ సాయంత్రం నాలుగు గంటలకు వీటిపై వివరణ ఇచ్ఛే అవకాశం ఉంది.