యూపీలో ఘోర ప్రమాదం.. 24 మంది వలసకూలీలు దుర్మరణం

ఎదురెదురుగా అతివేగంతో వస్తున్న ఈ ట్రక్కులు అదుపుతప్పి ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. భాదితులంతా వలస కూలీలుగా గుర్తించారు.

యూపీలో ఘోర ప్రమాదం.. 24 మంది వలసకూలీలు దుర్మరణం
Follow us

|

Updated on: May 16, 2020 | 12:24 PM

ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వ‌ల‌స కూలీల‌తో వెళ్తున్న ట్ర‌క్కును మ‌రో వాహ‌నం ఢీకొట్టింది. దీంతో 23 మంది వ‌ల‌స‌కూలీలు మృతిచెందారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఔరాయా జాతీయ ర‌హ‌దారిపై ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. రాజ‌స్థాన్ నుండి యూపీ వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…
ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 20మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. ఔరయా వద్ద రెండు ట్రక్కులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జ‌రిగింది.. ఎదురెదురుగా అతివేగంతో వస్తున్న ఈ ట్రక్కులు అదుపుతప్పి ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. భాదితులంతా వలస కూలీలుగా గుర్తించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంతో వీరంతా రాజస్థాన్ నుంచి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ఓ ట్రక్కులో వస్తుండగా.. ఔరయా నుంచి ఎదురుగా వస్తున్న మరో వాహ‌నం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.