Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

అన్నదాతలకు తీపికబురు.. వానలే వానలు

Weather station, అన్నదాతలకు తీపికబురు.. వానలే వానలు

ఏపీ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాన జాడ లేక దాదాపు రెండు నెలలు గడిచిపోయింది. తాజాగా వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా.. కేరళ తీరాన్ని రుతు పవనాలు 15 రోజులపాటు ఆలస్యంగా తాకడంతో ఏపీలో కూడా వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 18న రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించిన రెండు మూడు రోజుల్లోనే అవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడుతోందని.. రానున్న రోజుల్లో ఇది మరింత బలపడుతుందని చెప్పారు. ఈ తరహా వాతావరణం ఏర్పడినప్పుడు ఆకాశంలో మబ్బులు ఏర్పడి.. ఆ తర్వాత క్రమంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతుందని వివరించారు. వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ కబురుతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Tags