Multibagger Stock: లక్ష రూపాయల పెట్టుబడి రూ.3 కోట్లు అయ్యాయి.. ఆ మల్టీబ్యాగర్ స్టాక్ ఏమిటంటే..

|

Dec 31, 2021 | 9:17 PM

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు సహనం అత్యంత ముఖ్యమైన సద్గుణాలలో ఒకటి. ఎందుకంటే డబ్బు అనేది స్టాక్‌లను కొనడం, విక్రయించడంలో కాదు వేచి ఉండటంలో ఉంటుంది.

Multibagger Stock: లక్ష రూపాయల పెట్టుబడి రూ.3 కోట్లు అయ్యాయి.. ఆ మల్టీబ్యాగర్ స్టాక్ ఏమిటంటే..
Multibagger Stocks
Follow us on

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు సహనం అత్యంత ముఖ్యమైన సద్గుణాలలో ఒకటి. ఎందుకంటే డబ్బు అనేది స్టాక్‌లను కొనడం, విక్రయించడంలో కాదు వేచి ఉండటంలో ఉంటుంది. అవంతి ఫీడ్స్ షేర్లు దీనికి అద్భుతమైన ఉదాహరణ. NSEలో హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ స్టాక్ ధర రూ.1.63 నుంచి రూ.550.05కి పెరిగింది. (8 జనవరి 2010న NSEలో ముగింపు ధర రూ.1.63 ఉండగా.. 30 డిసెంబర్ 2021న NSEలో ముగింపు ధర రూ. 550.05గా ఉంది) దాదాపు 12 సంవత్సరాల కాలంలో దాదాపు 33,650 శాతం పెరిగింది.

గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 525 నుండి రూ. 550కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 5 శాతం పెరిగింది. గత 6 నెలల్లో అవంతి ఫీడ్స్ షేర్ ధర రూ.545.85 నుండి రూ. 550.05కి పెరిగింది. ఈ కాలంలో 1 శాతం కంటే తక్కువ పెరిగింది. గత ఒక సంవత్సరంలో కూడా స్టాక్ దాని వాటాదారులకు దాదాపు 5 శాతం రాబడిని ఇచ్చింది. గత 5 సంవత్సరాల్లో మల్టీబ్యాగర్ షేర్ ధర రూ.175 నుండి రూ. 550కి చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 210 శాతం పెరిగింది. గత 10 సంవత్సరాలలో అవంతి ఫీడ్స్ షేరు ధర ఒక్కో స్థాయికి రూ.8.18 నుండి రూ. 5550.05 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 6,600 శాతం పెరిగింది. గత 12 సంవత్సరాలలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఒక్కో షేరు స్థాయికి రూ.1.63 నుండి రూ.550 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 337 రెట్లు పెరిగింది.

ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ఈరోజు రూ.1.05 లక్షలకు చేరి ఉండేది. 5 సంవత్సరాల క్రితం 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ఇప్పుడు 3.10 లక్షలుగా ఉండేది. ఒక పెట్టుబడిదారుడు 10 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ. 56.50 లక్షలకు చేరేది.

Read Also.. Petrol Diesel Price: 2021లో మంట పుట్టించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!