లీడర్లకు మోదీ షాక్.. మరో ఏడేళ్ళు అంతే !

మోదీ తీసుకున్న ఓ నిర్ణయం కొంతమంది నేతల ఆశల మీద నీళ్లు చల్లింది. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ సర్కారు రద్దు చేస్తుందని కొందరు, మార్పు చేస్తుందని మరికొందరు ఎదురుచూశారు. కానీ రెండూ జరగలేదు. రిజర్వేషన్లను పదేళ్లపాటు పొడిగించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల శైలినే ప్రదర్శించారు నరేంద్రమోదీ. త్వరలో మోదీ గుడ్‌న్యూస్‌ చెబుతారని బీసీ, ఓసీ నేతలంతా ఎదురుచూశారు. కానీ.. వారు ఆశించింది జరక్కపోవడంతో షాక్ అయ్యారు. చట్టసభల్లో ఎస్సీఎస్టీ రిజర్వేషన్‌‌లను మరో పదేళ్ళపాటు పొడిగిస్తూ […]

లీడర్లకు మోదీ షాక్.. మరో ఏడేళ్ళు అంతే !
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 5:04 PM

మోదీ తీసుకున్న ఓ నిర్ణయం కొంతమంది నేతల ఆశల మీద నీళ్లు చల్లింది. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ సర్కారు రద్దు చేస్తుందని కొందరు, మార్పు చేస్తుందని మరికొందరు ఎదురుచూశారు. కానీ రెండూ జరగలేదు. రిజర్వేషన్లను పదేళ్లపాటు పొడిగించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల శైలినే ప్రదర్శించారు నరేంద్రమోదీ. త్వరలో మోదీ గుడ్‌న్యూస్‌ చెబుతారని బీసీ, ఓసీ నేతలంతా ఎదురుచూశారు. కానీ.. వారు ఆశించింది జరక్కపోవడంతో షాక్ అయ్యారు.

చట్టసభల్లో ఎస్సీఎస్టీ రిజర్వేషన్‌‌లను మరో పదేళ్ళపాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇపుడున్న రిజర్వేషన్లు మరో పదేళ్ల పాటు కొనసాగుతాయి. దీనికోసం జాతీయ పౌరసత్వ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును కూడా ఆమోదించబోతున్నారు. ఇది తెలంగాణలోని కొందరు నేతల ఆశలపై నీళ్లు చల్లిందని చెబుతున్నారు.

గత రెండు మూడు దశాబ్దాలుగా, అనేక నియోజకవర్గాలు ఎస్సీఎస్టీలకు రిజర్వ్‌ అయి ఉన్నాయి. ఈసారి రిజర్వేషన్లు రద్దయినా, లేదా మారినా, అక్కడ తమకు అవకాశం వస్తుందని ఆయా స్థానాల్లో ఉన్న ఓసీ, బీసీ నేతలు ఎదురుచూశారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న తరుణం ఇది. దీంతో రిజర్వేషన్ల విషయంలోనూ ఏదో ఒక మార్పు జరగొచ్చని వీరంతా భావించారు.

కేంద్రంపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు, ఈసారి తాము పోటీ చేయటం ఖాయమని చెప్పుకున్నారట. రిజర్వేషన్లు మారుతున్నాయనీ, ఈసారి ఎమ్మెల్యే అవటం ఖాయమని ఆదిశగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు కొందరు నేతలు. కేంద్రం తాజా నిర్ణయంతో వారంతా ఉసూరుమంటున్నారు. రిజర్వేషన్ల సంగతి పక్కన పెడితే, కనీసం నియోజకవర్గాల పెంపు అయినా ఉంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తమకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారట.

తెలంగాణ వచ్చిన తర్వాత మారిన రాజకీయపరిస్థితుల్లో , కాంగ్రెస్‌ టీడీపీల నుంచి నేతలు భారీ స్థాయిలో టీఆర్‌ఎస్‌లోకి వలసవచ్చారు. ఈ వలస వచ్చిన నేతలంతా ఎమ్మెల్యేలుగా పోటీచేసే అవకాశం కోసం కాచుకుని కూర్చున్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆశలు ఫలించలేదు కాబట్టి, నియోజకవర్గాలను పెంచితేనే వీరికి అవకాశం దొరుకుతుంది. మరి వీరికి మోదీ గుడ్‌న్యూస్‌ చెబుతారో లేదో చూడాలి !