ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలోని ఐదు స్థానాలకు తెలంగాణాలోని ఐదు స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న దీనిపై నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 1న పరిశీలన, 5న ఉపసంహరణకు చివరి తేది. మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ […]

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2019 | 11:06 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలోని ఐదు స్థానాలకు తెలంగాణాలోని ఐదు స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న దీనిపై నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 1న పరిశీలన, 5న ఉపసంహరణకు చివరి తేది. మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది.