మినీ ఛీటాల ‘ గమ్మత్తు ‘ విన్యాసాలు చూడాల్సిందే..

‘ మేము సైతం ‘ అంటున్నాయి మినీ ఛీటా రోబోలు.. ‘ మనుషులకే కాదు.. మాకూ ఆటలు ఆడడం , విన్యాసాలు చేయడం, జిమ్నాస్టిక్స్ లో మా పవర్ చూపడం వచ్చు.. అంటూ గంతులేస్తున్నాయి. వీటి వింత గేమ్స్ చూడాలంటే మసాచ్యూసెట్స్ వెళ్లాల్సిందే.. అక్కడి టెక్నాలజీ ఇన్స్ టి ట్యూట్ రీసెర్చర్లు ఈ మధ్య విచిత్రమైన ‘ పిల్ల ‘ ఛీటా రోబోలను సృష్టించారు. ఒక్కొక్కటి సుమారు 20 పౌండ్ల బరువున్న ఈ రోబోలను ఎంచక్కా రిమోట్ […]

మినీ ఛీటాల ' గమ్మత్తు ' విన్యాసాలు చూడాల్సిందే..
Follow us

|

Updated on: Nov 09, 2019 | 2:56 PM

‘ మేము సైతం ‘ అంటున్నాయి మినీ ఛీటా రోబోలు.. ‘ మనుషులకే కాదు.. మాకూ ఆటలు ఆడడం , విన్యాసాలు చేయడం, జిమ్నాస్టిక్స్ లో మా పవర్ చూపడం వచ్చు.. అంటూ గంతులేస్తున్నాయి. వీటి వింత గేమ్స్ చూడాలంటే మసాచ్యూసెట్స్ వెళ్లాల్సిందే.. అక్కడి టెక్నాలజీ ఇన్స్ టి ట్యూట్ రీసెర్చర్లు ఈ మధ్య విచిత్రమైన ‘ పిల్ల ‘ ఛీటా రోబోలను సృష్టించారు. ఒక్కొక్కటి సుమారు 20 పౌండ్ల బరువున్న ఈ రోబోలను ఎంచక్కా రిమోట్ కంట్రోల్ ద్వారా తమ సంస్థ ఆవరణలోని గ్రౌండ్స్ లో ‘ ఆడించారు ‘. జంపింగ్, లాండింగ్, సాకర్ గేమ్స్, జిమ్నాస్టిక్స్.. ఇలా అన్నింటిలో ఇవి తమ ‘ టాలెంట్ ‘ చూపాయి. అంటే రీసెర్చర్లు రిమోట్ కంట్రోళ్లతో వీటిని సింక్రనైజ్ చేయిస్తుండగా… చూసే వాళ్లంతా ఆశ్చర్యంగా నోళ్లు వెళ్ళబెట్టారు. . గమ్మత్తుగా, తమాషాగా ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..