Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

ఈ శవం కళ్లు ఎమ్మయ్యాయో తెలుసా..?

Eyes Missing from Dead Body, ఈ శవం కళ్లు ఎమ్మయ్యాయో తెలుసా..?

శవం కళ్లు..ఎలుకల భోక్తం కోల్‌కత్తాలోని ఓ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి కళ్లు మాయం అయ్యాయి. మృతదేహం ముఖంలో రెండు కళ్లు లేకపోవడంతోబంధువులు,కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో జరిగిన ఘటనపై దర్యాప్తు చేప్టటిన అధికారులు కంగుతినే నిజం వెల్లడించారు.

69 ఏళ్ల శంభునాథ్‌ దాస్‌ అనే వృద్దుడు రోడ్డుప్రమాదంలో మరణించాడు. శంభునాథ్‌ మృతదేహన్ని ఆస్పత్రికి తరలించిన పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం డెడ్‌బాడీని మార్చురీకితరలించారు. అయితే, మార్చురీలో ఎలుకలు, పెద్ద పెద్ద పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. అవి శంభునాథ్‌ శవంపై దాడిచేసి అతని రెండు కళ్లను తినేశాయట. అది గమనించలేనిఆస్పత్రి సిబ్బంది మృతదేహన్ని అతడి బంధువులకు అప్పగించారు. కళ్లు లేని తమ తండ్రి శవంతో కొడుకు ఆందోళనకు దిగాడు. జరిగిన ఘటనపై సరైన సమాధానం కావాలని డిమాండ్‌ చేయడంతో సదరు ఆస్పత్రిలోని  పై అధికారులు ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తుకు ఆదేశించారు. మార్చురీలో ఎలుకలు తిరుగుతున్నాయనే మాట వాస్తవేనని, వాటినితరిమికొట్టేందుకు ప్రయత్నాల జరుగుతున్నాయని తెలిపారు.