‘మహర్షి’ కోసం టికెట్ల రేట్లు పెంచలేదు: తలసాని

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మహర్షి కోసం టికెట్ల రేట్లు పెరిగాయన్న వార్త ప్రస్తుతం దుమారం రేపుతోంది. అయితే.. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచలేదని, టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.80 నుంచి 110లు, మల్టీప్లెక్స్‌లో 130 నుంచి 200 రూపాయలకు టికెట్ ధర పెంచేందుకు ప్రభుత్వం […]

'మహర్షి' కోసం టికెట్ల రేట్లు పెంచలేదు: తలసాని
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 1:14 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మహర్షి కోసం టికెట్ల రేట్లు పెరిగాయన్న వార్త ప్రస్తుతం దుమారం రేపుతోంది. అయితే.. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచలేదని, టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.80 నుంచి 110లు, మల్టీప్లెక్స్‌లో 130 నుంచి 200 రూపాయలకు టికెట్ ధర పెంచేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఇలాంటి ప్రచారాలు తప్పు దారి పట్టించేలా ఉన్నాయని తెలిపారు. అలాగే.. థియేటర్ యాజమాన్యాల కామెంట్స్‌పై కూడా స్పందించారు. అటువంటి యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఒక వారం పాటు మాత్రమే ఈ టికెట్ల ధరలు ఉంటాయని.. తదుపరి యధామామూలేనని అంటున్నాయి. అయితే.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని చూపిస్తూ.. కోర్టు వద్దకు వెళ్లి టికెట్ల పెంపు నిర్ణయానికి అనుకూలంగా మహర్షి చిత్ర నిర్మాతలు అనుమతి తెచ్చుకున్న వైనం బయటకు వచ్చింది. దీంతో.. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు మాట మాత్రం చెప్పకుండా.. కీలక నిర్ణయాన్ని చిత్ర నిర్మాతలు ఎలా తీసుకుంటారన్న కోపంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో