మధ్యప్రదేశ్ రాజకీయం.. బలపరీక్షలో విజయం కోసం యజ్ఞం

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో నెగ్గాలని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ' శత్రు వినాశన యజ్ఞాన్ని' నిర్వహించారు. దీనివల్ల శత్రువులు నాశనమైతారట (ఓడిపోతారట)..

మధ్యప్రదేశ్ రాజకీయం.. బలపరీక్షలో విజయం కోసం యజ్ఞం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 15, 2020 | 4:13 PM

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో నెగ్గాలని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ‘ శత్రు వినాశన యజ్ఞాన్ని’ నిర్వహించారు. దీనివల్ల శత్రువులు నాశనమైతారట (ఓడిపోతారట).. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీ.సీ.శర్మ అనే ఈ మంత్రిగారు అగర్-మాల్యా అనే జిల్లాలోని  ఓ ఆలయంలో హోమం నిర్వహించారు. అయితే శాసన సభలో మా ప్రభుత్వం నెగ్గేలా చూసేందుకు తామేమీ ఈ యజ్ఞం చేయడంలేదని, తాను మత వ్యవహారాలను కూడా పర్యవేక్షించే శాఖకు మంత్రినని, భక్తుల సంక్షేమం కోసం మేము చేపట్టే వివిధ కార్యక్రమాలను  తను పరిశీలించవలసి ఉందని శర్మ పేర్కొన్నారు. ఈ జిల్లాలోని బాగ్లాముఖి ఆలయాన్ని నేను విజిట్ చేశాను. ఈ కారణంగా ఇక మా ప్రభుత్వానికి వచ్ఛే ముప్పేమీ లేదని భావిస్తున్నా అన్నారాయన. 121 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవెంట ఉన్నారని, మరో నలుగురైదుగురు  కూడా తమ ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు రెడీగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే..  గత  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హోమం నిర్వహించి ఓటమిని చవి చూసిన విషయాన్ని  రెబెల్స్ గుర్తు చేస్తున్నారు.