లాక్ డౌన్ పొడిగించండి.. జిమ్స్, రెస్టారెంట్లకు అనుమతివ్వండి…

మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 4.0 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 అమలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగించాలని ఆయన అన్నారు. నాలుగోదశ లాక్ డౌన్ మే 31తో ముగుస్తుండటంతో కేంద్ర హోంమంత్రి […]

లాక్ డౌన్ పొడిగించండి.. జిమ్స్, రెస్టారెంట్లకు అనుమతివ్వండి...
Follow us

|

Updated on: May 29, 2020 | 2:45 PM

మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 4.0 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 అమలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగించాలని ఆయన అన్నారు.

నాలుగోదశ లాక్ డౌన్ మే 31తో ముగుస్తుండటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ ద్వారా రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలను సేకరించారు. ఆ విషయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 15 రోజులపాటు లాక్ డౌన్ కొనసాగించాలని.. అయితే మరిన్ని సడలింపులు కూడా ఇవ్వాలని ఆయన కోరానన్నారు. 50 శాతం కెపాసిటీతో రెస్టారెంట్లు, జిమ్స్ ఓపెన్ చేసేందుకు అనుమతివ్వాలని అమిత్ షాను కోరినట్లు గోవా సీఎం వెల్లడించారు. కాగా, దేశంలో కరోనా కేసులు లక్షా 65 వేలు పైగా నమోదయ్యాయి.

Read This: ఏపీ హైకోర్టు సంచలన తీర్పుపై పవన్ ఏమన్నారంటే..!