కత్తిపోట్లతో దాడి.. క్రికెటర్ మృతి..!

Local Cricketer murdered in maharashtra, కత్తిపోట్లతో దాడి.. క్రికెటర్ మృతి..!

మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఓ క్రికెటర్ పై ముగ్గురు ఆగంతకులు కత్తితో డాడి చేసి హతమార్చారు. ముంబై నగరంలోని భాండప్ ప్రాంతానికి చెందిన రాకేష్ పన్వర్ తన గాల్ ఫ్రెండ్‌తో కలిసి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలతోనే తన కుటుంబసభ్యులే చంపి ఉంటారని మృతుడి స్నేహితుడు గోవింద్ రాథోడ్ చెప్పారు. హత్య జరిగిన సమయంలో రాకేష్ ప్రియురాలు తన వెంట ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాకేష్ క్రికెట్ కోచ్‌గా యువకులకు శిక్షణ ఇచ్చేవాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *