Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

లైవ్‌ అప్‌డేట్స్: నేడే అయోధ్య ఫైనల్ జడ్జిమెంట్..!

అయోధ్య రామజన్మభూమిపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెల్లడిస్తోంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సుమారు 4వేల మంది పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు. అయోధ్యలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

Picture

అయోధ్య తీర్పు

ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలి

09/11/2019,11:14AM
Picture

అయోధ్య తీర్పు

వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని సుప్రీం తెలిపింది. మూడు నెలల్లో అయెధ్య ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించిన సుప్రీం.. వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలని పేర్కొంది.

09/11/2019,11:13AM
Picture

అయోధ్య తీర్పు

గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన సుప్రీం

09/11/2019,11:07AM
Picture

అయోధ్య తీర్పు

పురావస్తుశాఖ నివేదికలో మసీదు, ఈద్గా నిర్మాణాలు ఉన్నట్లు లేదు: సుప్రీం

09/11/2019,11:07AM
Picture

అయోద్య తీర్పు

బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం, చట్టం అనుమతించదు: సుప్రీం

09/11/2019,11:05AM
Picture

అయోధ్య తీర్పు

వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయి: సుప్రీం

09/11/2019,11:04AM
Picture

అయోధ్య తీర్పు

రాంచబుత్రా, సోతారసోయ్ దగ్గర పూజలు జరిగేవి: సుప్రీం

09/11/2019,11:02AM
Picture

అయోధ్య తీర్పు

1855కు ముందు కూడా హిందువులు పూజలు చేసేవారు: సుప్రీం

09/11/2019,11:01AM
Picture

అయోధ్య తీర్పు

మత విశ్వాసాల ఆధారంగా ఈ భూమి ఎవదిదనే తీర్పు చెప్పలేం. స్థలానికి సంబంధించి సరైన పత్రాలు ఉన్న వారే భూహక్కుదారులు: సుప్రీం

09/11/2019,10:59AM
Picture

అయోధ్య తీర్పు

ముస్లింలకు అక్కడ నమాజ్ చేసుకునే హక్కు ఉంది: సుప్రీం

09/11/2019,10:58AM
Picture

అయోధ్య తీర్పు

బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో అంతకుముందు అక్కడ ఉంది ఆలయమా..? మసీదా..? అని చెప్పడానికి ఆధారాలు లేవు: న్యాయస్థానం

09/11/2019,10:55AM
Picture

అయోధ్య తీర్పు

రాముడు అయోధ్యలోనే పుట్టినట్లు హిందువుల నమ్మకం. వివాద స్థలంపై హక్కులు తేల్చాల్సింది రికార్డులే: సుప్రీం

09/11/2019,10:52AM
Picture

అయోధ్య తీర్పు

రాముడు అయోధ్యలోనే జన్మించడన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

09/11/2019,10:50AM
Picture

అయోధ్య తీర్పు

పురావస్తుశాఖ నివేదికలో మసీదు, ఈద్గా నిర్మాణాలు ఉన్నట్లు లేదు. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చినట్లు సాక్ష్యాలు లేవు: సుప్రీం

09/11/2019,10:49AM
Picture

అయోధ్య తీర్పు

మత విశ్వాసాలతో మాకు సంబంధం లేదన్న సుప్రీం

09/11/2019,10:48AM
Picture

అయోధ్య తీర్పు

మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదు. కట్టడం కింద మరో మతం నిర్మాణ ఆనవాళ్లు ఉన్నాయి: సుప్రీంకోర్టు

09/11/2019,10:47AM
Picture

అయోధ్య తీర్పు

రాంలాలా విరాజ్‌మాన్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు

09/11/2019,10:46AM
Picture

అయోధ్య తీర్పు

నిర్మొహి అకాడా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం. వివాదాస్పద స్థలంలో పూజలు చేసే హక్కు నిర్మొహి అకాడాకు లేదని చెప్పిన సుప్రీం.

09/11/2019,10:45AM
Picture

అయోధ్య తీర్పు

బాబర్ సైనాకాధికారులు బాబ్రీ మసీదును నిర్మించారన్న సుప్రీం

09/11/2019,10:44AM
Picture

అయోధ్య తీర్పు

ఏకగ్రీవంగా తీర్పును వెల్లడిస్తోన్న సర్వోన్నత న్యాయస్థానం

09/11/2019,10:43AM
Picture

అయోధ్య తుది తీర్పు

తీర్పును వెలువరిస్తున్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్

09/11/2019,10:41AM
Picture

అయోధ్య తుది తీర్పు

అరగంట పాటు తీర్పును చదువుతా-చీఫ్ జస్టింగ్ గొగొయ్

09/11/2019,10:37AM
Picture

అయోధ్య తుది తీర్పు

సున్నీవక్ఫ్ బోర్డుకు అనుకూలంగా సుప్రీం తీర్పు

09/11/2019,10:37AM
Picture

అయోధ్య తుది తీర్పు

షియా బోర్డు పిటిషన్ కొట్టివేత

09/11/2019,10:37AM
Picture

అయోధ్య తీర్పు

తీర్పును వెలువరిస్తోన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

09/11/2019,10:33AM
Picture

అయోధ్య తీర్పు

తీర్పు సీల్డ్ కవర్‌ను తెరిచిన న్యాయమూర్తులు

09/11/2019,10:32AM
Picture

అయోధ్య తీర్పు

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా, రాజీవ్ దావన్ బెంచ్ ముందు హాజరు

09/11/2019,10:25AM
Picture

అయోధ్య తీర్పు

కోర్టు హాల్ నెం.1లో సమావేశమైన రాజ్యాంగ ధర్మాసనం. కిక్కిరిసిపోయిన కోర్ట్ హాల్ నెం.1

09/11/2019,10:24AM
Picture

అయోధ్య తీర్పు

చీఫ్ జస్టిస్‌తో పాటు సుప్రీంకోర్టుకు చేరుకున్న నలుగురు జడ్జీలు

09/11/2019,9:57AM
Picture

అయోధ్య తీర్పు

సుప్రీంకోర్టుకు చేరుకున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

09/11/2019,9:57AM