Ramadan 2022: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.. ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ..!

|

Apr 08, 2022 | 5:47 PM

Ramzan 2022: ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరంలో 9వ నెల రంజాన్ నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో ప్రజలు రోజంతా

Ramadan 2022: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.. ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ..!
Ramadan 2022
Follow us on

Ramzan 2022: ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరంలో 9వ నెల రంజాన్ నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో ప్రజలు రోజంతా ఆకలితో, దాహంతో అల్లాని ఆరాధిస్తారు. సుమారు 29 రోజుల నుంచి 30 రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత రంజాన్‌ పండుగతో ఈ తంతు ముగుస్తుంది. దీనినే ఈద్-ఉల్-ఫితర్ అంటారు. ఈ పండుగ సందర్భంగా సర్వ మతాల వారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని విందును ఆరగిస్తారు. అయితే పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందే భోజనం చేస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. దీనినే ఇఫ్తార్ అంటారు. ఈ మాసంలో చేసే ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను తెస్తుంది. ఇటువంటి ఉపవాసాన్ని ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం ఎలా బాగుంటుందో తెలుసుకుందాం.

1. హార్మోన్లు, కణాల సామర్థ్యం మెరుగుపడుతుంది

ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని హార్మోన్లు, కణాలు, జన్యువుల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఇన్సులిన్ స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది. దెబ్బతిన్న కణాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి.

2. బరువు తగ్గుతారు

ఉపవాసం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఆకలి సమయంలో శరీరం నిల్వ ఉన్న కొవ్వుని వినియోగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.

3. గుండె ఆరోగ్యానికి మంచిది

ఉపవాసం గుండె జబ్బులను నివారిస్తుంది. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ మొదలైనవాటిని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4. మెదడుకి ప్రయోజనం

ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడినప్పుడు నేరుగా మెదడుకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల మెదడు కణాల సామర్థ్యం పెరుగుతుంది.

5. క్యాన్సర్ నివారణ

ఉపవాసం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలలో వెల్లడైంది. ఎందుకంటే ఉపవాస సమయంలో కణాలు రోగనిరోధక వ్యవస్థను పునరుత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Viral Video: ట్రాలీ నుంచి కిందపడబోయాడు.. కానీ కారు డ్రైవర్ దేవుడిలా వచ్చాడు..!

Kitchen vastu: వంటగది వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో ఈ అనర్థాలు తప్పవు..!

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!