Betel leaf: ఓర్నీ.. ఈ ఆకుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? రోజూ ఒకటి నమిలితే

భారతీయులు తమలపాకుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అన్ని పంక్షన్లలోనూ దీని ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తమలపాకును తరచుగా పూజలు, వివాహ వేడుకలు వంటి శుభ కార్యాలలో ఉపయోగిస్తారు. ఈ ఆకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఔషధ తయారీలలో ఉపయోగించబడుతుంది. తమలపాకు బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

Betel leaf: ఓర్నీ.. ఈ ఆకుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? రోజూ ఒకటి నమిలితే
Betel Leaf

Updated on: Feb 16, 2024 | 3:09 PM

గ్రామాల్లో రాత్రి భోజనం చేసిన తర్వాత తమలపాకులో వక్క వేసి నములతారు. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. అలానే నోటి దుర్వాసన కూడా ఉండదు. ఇక ఇటీవలి రోజుల్లో వివిధ రకాల పాన్‌లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే పాన్‌లు, కిల్లీల కోసం ఉపయోగించే.. తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ తమలపాకులో అనేక వ్యాధులను దూరం చేసే శక్తి ఉంది.

* తమలపాకులతో పాటు తులసి ఆకులు, లవంగాలు, పచ్చకర్పూరం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే కఫం, దగ్గు సమస్య దూరమవుతుంది.

* చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు తమలపాకులను కొబ్బరినూనెలో కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.

తమలపాకులను వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, తేనె కలిపి నమలడం వల్ల సిరల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

* తమలపాకుకు కొద్దిగా పసుపు రాసి పిల్లల తలకు పట్టిస్తే జలుబు సమస్య తగ్గుతుంది.

* గర్భిణీ స్త్రీలు తల్లిపాలు పెరగడానికి తమలపాకులు తీసుకోవడం మంచిది.

* చిన్న చిన్న గాయాల నుంచి రక్తస్రావం అవుతుంటే తమలపాకులను మెత్తగా రుబ్బి గాయంపై రాస్తే రక్తస్రావం ఆగుతుంది.

* తమలపాకును ఉప్పుతో నమిలి ఆ రసాన్ని మింగితే కడుపునొప్పి తగ్గుతుంది.

* తమలపాకును నమలడం వల్ల లాలాజల రసం పెరిగి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

* భోజనం చేసిన తర్వాత ఆకులను తింటే.. నోటి దుర్వాసన దూరమై మౌత్ హెల్త్ బాగుంటుంది.

* మొటిమల వల్ల ముఖం నిండా అల్లుకుపోతే..  తమలపాకును మెత్తగా నూరి మొటిమల మీద రాస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.

* తమలపాకులను గ్రైండ్ చేసి కొబ్బరినూనెలో వేడిచేసి నొప్పి ఉన్న చోట రాస్తే పెయిన్ తగ్గుతుంది.

* తమలపాకులను రోజూ తింటే చిగుళ్లలో రక్తస్రావం ఆగుతుంది.

* బరువు తగ్గాలనుకునే వారు తమలపాకు కషాయాలను తయారు చేసి విరివిగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి బరువు తగ్గుతారు.

* తమలపాకు రసంతో పాటు నిమ్మరసం కలిపి రాసుకుంటే దురద సమస్య తగ్గుతుంది.

* తలనొప్పిగా ఉంటే కర్పూరం, కొబ్బరినూనెలో తమలపాకుల రసాన్ని కలిపి నుదుటిపై రాసుకుంటే నయమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..