Health: నైట్‌ షిఫ్ట్‌లో పనిచేసే మహిళల్లో ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం..

|

Sep 14, 2024 | 7:38 PM

జామా జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. రాత్రిపూట పని చేసే మహిళల్లో ఇతర మహిళలతో పోల్చితే రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ పరిశోధన ప్రకారం, 24 గంటల శరీర గడియార అంతరాయం శరీరంలో క్యాన్సర్ కణితులను ఏర్పరిచే క్యాన్సర్ కణాల ఏర్పాటుకు దారితీస్తుందని అంటున్నారు...

Health: నైట్‌ షిఫ్ట్‌లో పనిచేసే మహిళల్లో ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం..
Women Night Shift
Follow us on

ప్రస్తుతం కాలం మారింది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవారికే పరిమితం అయిన నైట్‌ షిఫ్ట్స్‌లో ఇప్పుడు మహిళలు కూడా పనిచేస్తున్నారు. అయితే నైట్‌ షిఫ్టుల్లో పనిచేయడం మహిళల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహళలకు ఇతర మహిళలతో పోల్చితే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

జామా జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. రాత్రిపూట పని చేసే మహిళల్లో ఇతర మహిళలతో పోల్చితే రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ పరిశోధన ప్రకారం, 24 గంటల శరీర గడియార అంతరాయం శరీరంలో క్యాన్సర్ కణితులను ఏర్పరిచే క్యాన్సర్ కణాల ఏర్పాటుకు దారితీస్తుందని అంటున్నారు.

నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి క్యాన్స్‌ ప్రమాదాన్ని పెంచేందుకు ఎన్నో అంశాలు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మెలటోనిన్‌ ప్రధానమైంది. ఇది రాత్రిపూట నిద్రపోయేటప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన హార్మోన్, కానీ రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఈ హార్మోన్‌ ఉత్పత్తి అవదు. నిజానికి ఈ హార్మోన్‌ శరీరంలో క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా అడ్డుకుటుంది. అలాగే కణితుల అభివృద్ధికి సంబంధించిన జన్యువులను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రాత్రిపూట శరీరంలో ఈ హార్మోన్‌ ఉత్పత్తి కావడం చాలా అవసరం. రాత్రి పూట సరైన నిద్ర లేని వారిలో క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుంది.

ఇక రాత్రి పూట పని చేసే వారు ఉదయం పనిచేసే వారితో పోల్చితే ఎక్కువ జంక్‌ ఫుడ్‌, కూల్ డ్రింక్స్‌ తీసుకుంటారు. పగటిపూట ప్రజలు పండ్లు, సలాడ్లు, మొలకలు వంటివి తింటారు. అయితే రాత్రిపూట పనిచేసే వారు.. స్నాక్స్, పిజ్జా, బర్గర్లు వంటివి తిటారు. ఇది రక్తపోటు, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలను పెంచుతుంది. ఇక నైట్‌ షిఫ్టుల్లో పనిచేసే పురుషుల్లో కూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంటుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్‌ వృద్ధాప్యంలో వచ్చే అవకాశాలు ఉంటాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..