Beauty Tips: రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. అందమైన, మెరిసే చర్మం మీ సొంతం!

చలికాలంలో పొడిబారే చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి రాత్రిపూట సరైన సంరక్షణ అవసరం. తగినంత నీరు త్రాగడం, వేడి నీటి స్నానాలను తగ్గించడం, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ముఖ్యం. పడుకునే ముందు ముఖాన్ని పచ్చి పాలతో శుభ్రం చేసి, రోజ్ వాటర్-గ్రీన్ టీ టోనర్‌తో తాజాగా ఉంచండి. విటమిన్ E సమృద్ధిగా ఉండే బాదం నూనెతో మాయిశ్చరైజ్ చేయడం ద్వారా మెరిసే, అందమైన చర్మాన్ని పొందవచ్చు.

Beauty Tips: రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. అందమైన, మెరిసే చర్మం మీ సొంతం!
Beauty Tips

Updated on: Jan 15, 2026 | 1:30 PM

చలికాలంలో మన చర్మం తరచుగా పొడిగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణం చల్లని, పొడి గాలి. అలాగే చలికాలంలో చాలా మందికి పెదవులపై చర్మం పొట్టులాగా మారుతుంది. అందుకే శీతాకాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యమని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇందుకోసం జనాలు మార్కెట్‌లో లభించే అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే చలికాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి.

శీతాకాలపు చర్మ సంరక్షణ కోసం

శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే, మీరు తగినంత నీరు త్రాగడం ఎంతో ముఖ్యం. అలాగే స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం ఆపేయండి. దాంతో పాటు బాధం, వాట్‌నట్స్ వంటి డ్రైప్రూట్స్‌ను నానబెట్టుకొని తినండి. వీటిలో మంచి కొవ్వులు, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి లోపలి నుండి ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతాయి. ఇవే కాకుండా ఇప్పుడు ఇక్కడ చెప్పబోచే చిట్కాలను క్రమం తప్పకుండా పాటించండి. అప్పుడే మీరు రిజల్ట్ చూస్తారు.

రోజూ రాత్రి ఇవి పాటించండి

రోజూ సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని కడుక్కోవడం, పచ్చి పాలలో ముంచిన కాటన్ బాల్‌తో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మానికి తేమను అందిస్తుంది. పాలలో లాక్టోస్ ఉంటుంది, ఇది మీ చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ చర్మాన్ని ప్రతిరోజూ టోన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజ్ వాటర్, గ్రీన్ టీ ఉత్తమమైనవి. గ్రీన్ టీని మరిగించి వడకట్టి, దానిలో రోజ్ వాటర్ వేసి బాటిల్‌లో స్టోర్ చేసి ఉంచుకోండి. దాన్ని మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత స్ప్రే చేయండి. ఇది మీ చర్మాన్ని తాజాగా ,ప్రకాశవంతంగా ఉంచుతుంది, కాలుష్యం, ఎండ, దుమ్ము వల్ల కలిగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది.

శీతాకాలంలో, చర్మాన్ని శుభ్రపరచడం, టోన్ చేయడంతో పాటు, మాయిశ్చరైజింగ్ కూడా చాలా ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం బాదం నూనెను ఉపయోగించడం. ఇందులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. మీరు బాదం నూనెతో ఫేస్ మసాజ్ చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.