
Winter Health Tips Telugu: ఉదయం వేళల్లో చలి క్రమంగా పెరుగుతోంది. చల్లని గాలులు, ఉష్ణోగ్రతల్లో మార్పులతో చాలామందికి జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే చల్లని వాతావరణం వల్ల నేరుగా వైరల్ ఇన్ఫెక్షన్లు రావు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఎక్కువసేపు గదుల్లోనే ఉండటం, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో వైరస్‌లు వ్యాపించే అవకాశం పెరుగుతుంది. మన రోజువారీ అలవాట్లలో చేసే కొన్ని పొరపాట్లు కూడా అనారోగ్యానికి దారితీయవచ్చు.
న్యూస్9 డిజిటల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మెడ్‌ఫస్ట్ ఈఎన్‌టీ సెంటర్ కన్సల్టెంట్ డాక్టర్ (మేజర్) రాజేష్ భరద్వాజ్ ప్రకారం.. వాతావరణ మార్పుల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించుకోవచ్చు.
ఆస్తమా, సీఓపీడీ (COPD), గుండె సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గినవారు వాతావరణ మార్పుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు అవసరమైన టీకాలు వేయించుకోవడం కూడా ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.
ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, తగ్గని అధిక జ్వరం లేదా లక్షణాలు తీవ్రమవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తగిన దుస్తులు ధరించడం, నీరు తాగడం, పరిశుభ్రత పాటించడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చిన్న అలవాట్లను నిర్లక్ష్యం చేయకూడదు.
(Disclaimer: ఈ కథనం సాధారణ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి.)