యువతలో బీపీ ఎందుకు పెరుగుతుంది..? మీ గుండెను ఆపేసే రక్తపిశాచి గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

అరవై ఏళ్లలో రావాల్సిన హైబీపీ.. ఇప్పుడు పాతికేళ్లకే ప్రాణ సంకటంగా మారుతోంది. ఎలాంటి శబ్దం చేయకుండా, బయటకు ఎటువంటి లక్షణాలు చూపించకుండా లోలోపలే ఆర్గాన్స్‌ను తినేసే ఈ సైలెంట్ కిల్లర్ ఇప్పుడు యువతను వేటాడుతోంది. 140/90.. ఇది కేవలం బీపీ రీడింగ్ మాత్రమే కాదు, మీ ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పుకు సంకేతం..

యువతలో బీపీ ఎందుకు పెరుగుతుంది..? మీ గుండెను ఆపేసే రక్తపిశాచి గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..
High Blood Pressure Symptoms In Youth

Updated on: Feb 20, 2026 | 2:17 PM

ఒకప్పుడు బీపీ, షుగర్ అంటే అరవై ఏళ్లు దాటిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. 20 ఏళ్ల యువకుడి నుంచి 35 ఏళ్ల టెక్కీల దాకా అందరూ హై బ్లడ్ ప్రెజర్ బారిన పడుతున్నారు. శరీరంలో ఎలాంటి శబ్దం లేకుండా బయటకు ఎటువంటి భారీ లక్షణాలు చూపించకుండా ప్రాణాలను తోడేస్తున్న ఈ సైలెంట్ కిల్లర్ పట్ల వైద్య నిపుణులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. రక్త నాళాలలో రక్త ప్రవాహం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానిని అధిక రక్తపోటు అంటారు. మీ బీపీ రీడింగ్ నిరంతరం 140/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. ప్రారంభంలో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు.. కానీ లోపల మీ గుండె, మెదడు, మూత్రపిండాలను మెల్లగా దెబ్బతీస్తూ ఉంటుంది.

యువతలో బీపీ పెరగడానికి కారణాలేంటి?

  • లేడీ హార్డింజ్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ ప్రకారం.. నేటి ఆధునిక జీవనశైలే యువత పాలిట శాపంగా మారింది.
  • రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, స్క్రీన్ల ముందే గంటల కొద్దీ గడపడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటోంది.
  • బయటి ఆహారం, ప్యాక్ చేసిన ఫుడ్స్‌లో ఉండే విపరీతమైన ఉప్పు రక్తపోటును అమాంతం పెంచేస్తోంది.
  • కెరీర్, పర్సనల్ లైఫ్ టెన్షన్లతో మానసిక ఒత్తిడి పెరిగి అది నేరుగా హార్ట్ రేట్ మీద ప్రభావం చూపుతోంది.
  • శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యం సేవించడం ఈ ముప్పును డబుల్ చేస్తున్నాయి.

వార్నింగ్ సిగ్నల్స్: వీటిని లైట్ తీసుకోకండి

మీకు తరచుగా ఈ లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..

  • తరచుగా వచ్చే తలనొప్పి, తలతిరగడం.
  • కొంచెం నడిచినా శ్వాస ఆడకపోవడం, ఆయాసం.
  • ఛాతీలో ఏదో భారంగా అనిపించడం.
  • కంటి చూపు మసకబారడం.
  • కారణం లేకుండా ముక్కు నుండి రక్తం రావడం.

నివారణే మార్గం..

  • హైబీపీని కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కేవలం మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు..
  • రోజూ నడక లేదా జిమ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
  • కూరల్లో ఉప్పు తగ్గించడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం.
  • ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి.
  • కుటుంబంలో బీపీ హిస్టరీ ఉంటే క్రమం తప్పకుండా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి.
Follow Us