ఆవిలింత రావడానికి అసలు కారణం..’ఆక్సిజన్’ అందకపోవడమేనట!

సాధారణంగా ప్రతీ మనిషికీ ఆవిలింతలు రావడం సహజం. అందులోనూ ఒకరు ఆవిలిస్తే.. మరొకరికి రావడం కూడా మనం గమనిస్తూంటాం. ఎంత సీరియస్‌గా పని చేస్తున్నా, చదువుతున్నా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి. అయితే బాగా అలిసి పోవడం వల్ల..

ఆవిలింత రావడానికి అసలు కారణం..ఆక్సిజన్ అందకపోవడమేనట!

Updated on: Jun 29, 2020 | 7:06 PM

సాధారణంగా ప్రతీ మనిషికీ ఆవిలింతలు రావడం సహజం. అందులోనూ ఒకరు ఆవిలిస్తే.. మరొకరికి రావడం కూడా మనం గమనిస్తూంటాం. ఎంత సీరియస్‌గా పని చేస్తున్నా, చదువుతున్నా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి. అయితే బాగా అలిసి పోవడం వల్ల లేక నిద్ర రావడం వల్ల ఈ ఆవిలింతలు వస్తూంటాయని పెద్దలు చెబుతూంటారు. కానీ మరి ఇలా ఆవిలింతలు రావడానికి అసలు కారణాలు ఏంటి? ఎందుకు ఇలా వస్తాయి? అన్న విషయంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

నిజానికి ఈ ఆవిలింతలు అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతాయట. అప్పుడు మొదలైన అలవాటు జీవితాంతం వదలిపెట్టదు. అసలు ఈ ఆవిలింతలు రావడానికి ముఖ్య కారణం ఆక్సిజన్ అందకపోవడమనేట. అవును మీరు విన్నది నిజమే. మెదడుకి సరిపడా ఆక్సిజన్ అందకపోవటం వల్లనే ఈ ఆవిలింతలు వస్తాయని.. శాస్త్రవేత్తలు ఎప్పుడో వెల్లడించారు. ఇప్పటికీ ఇదే చెబుతున్నారు.

మెదడుకి ఆక్సిజన్‌ను అందించడానికి శరీరం ఆవిలింతల రూపంలో అధిక మొత్తంలో గాలిని తీసుకుంటుందట. దీంతో మెదడు చురుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక మనిషి తన జీవిత కాలంలో 400 గంటలు ఆవలిస్తాడట. అంటే 2.4 లక్షల సార్లు ఆవిలిస్తారన్నమాట. మరి ఆవలిస్తారన్నమాట. అలాగే ఈ ఆవిలింతలు కేవలం మనుషులకు కాదు జంతువులకు కూడా వస్తాయి.

Read More: 

టెన్త్ ఎగ్జామ్స్‌ని మొత్తానికే రద్దు చేయండి.. మంచు హీరో సంచలన వ్యాఖ్యలు

వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

Loading...
Unable to load recommendations.
Follow Us