Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏంచేయాలి..? ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి..? ఈ తప్పులు అసలు చేయొద్దు..

ప్రస్తుతం దేశంలో కుక్కల దాడులు ఎక్కవగా వినిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సుప్రీం సైతం కుక్క దాడులపై ఆందోళణ వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కుక్క కరిస్తే ఎటువంటి చికిత్స తీసుకోవాలి..? ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి.? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏంచేయాలి..? ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి..? ఈ తప్పులు అసలు చేయొద్దు..
Dog Bite First Aid

Updated on: Aug 24, 2025 | 1:03 PM

దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్రంగా మారుతోంది. కుక్క కాటు కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కుక్క కరిస్తే, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రేబిస్ వంటి వ్యాధులు ప్రాణాలు తీయగలవు. ఈ నేపథ్యంలో కుక్క కాటుకు సరైన చికిత్స ఏంటిది..? ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కుక్క కాటుకు మూడు దశల చికిత్స

మొదటి దశ: ఈ దశలో కేవలం చర్మంపై గీతలు మాత్రమే పడతాయి. చాలామంది ఇలాంటి చిన్న గాయాలకు పసుపు లేదా కారం వంటి ఇంటి చిట్కాలను ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. ఈ సందర్భంలో గాయాన్ని నీటితో కనీసం 5-10 నిమిషాలు బాగా శుభ్రం చేసి, ఆపై యాంటీసెప్టిక్ క్రీమ్ రాయాలి.

రెండు, మూడవ దశ: ఈ రెండు దశల్లో పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స తప్పనిసరి. రెండవ దశలో కుక్క దంతాలు లోపలికి దిగి గాయం చేస్తాయి. మూడవ దశలో అయితే మాంసం బయటకువస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయాన్ని నీటితో శుభ్రం చేసిన తర్వాత రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గించడానికి గాయాన్ని పోవిడోన్-అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేయడం మంచిది. ఆ తర్వాత బెటాడిన్ వంటి యాంటీసెప్టిక్ మందులను ఉపయోగించాలి.

టెటనస్ – కుట్లు విషయంలో జాగ్రత్తలు

రెండవ, మూడవ దశల్లో గాయం తీవ్రంగా ఉంటుంది కాబట్టి టెటనస్ (ధనుర్వాతం) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా టెటనస్ ఇంజెక్షన్ తీసుకోవాలి. చాలామంది మాంసం బయటకు వచ్చినప్పుడు కుట్లు వేయించుకుంటారు. కానీ కుక్క కాటు గాయాలకు కుట్లు వేయించుకోవడం హానికరం అని డాక్టర్లు చెబుతున్నారు.దీని బదులుగా యాంటీబయోటిక్ మందులు వాడాలి.

ఎప్పుడు, ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి?

కుక్క కరిచిన వెంటనే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్సలో భాగంగా రోగికి ఐదు డోసుల టీకా ఇస్తారు.

మొదటి డోస్ : కుక్క కరిచిన రోజునే.

రెండవ డోస్: 3వ రోజు.

మూడవ డోస్: 7వ రోజు.

నాల్గవ డోస్: 21వ రోజు.

ఐదవ డోస్: అవసరమైతే 28వ రోజున ఇస్తారు.

కాబట్టి కుక్క కరిచినప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..