కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

కోమా అనేది ఒక వ్యక్తి చాలా కాలం పాటు అపస్మారక స్థితిలో ఉండే ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. ఈ సమయంలో ఆ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు స్పందించడు. ఆ వ్యక్తి మేల్కొనలేడు. సాధారణంగా మాట్లాడలేడు. కదలలేడు. అయితే ప్రతి రోగికి కోమా నుంచి బయటకు రావడానికి పట్టే సమయం భిన్నంగా ఉంటుంది..

కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?
Coma Recovery Chances

Updated on: Mar 22, 2026 | 12:55 PM

తీవ్రమైన మెదడు గాయం, పక్షవాతం, ఆక్సిజన్ లోపం, ఇన్ఫెక్షన్, మద్యం, మాదకద్రవ్యాల అధిక మోతాదు, తీవ్రమైన అనారోగ్యం వంటి కారణాల వల్ల సాధారణంగా కోమా రావచ్చు. మెదడుకు తగినంత ఆక్సిజన్ లేదా రక్తం అందనప్పుడు దాని సాధారణ విధులు దెబ్బతింటాయి. అప్పుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు. కోమాలో ఉన్నప్పుడు రోగికి తినడానికి, శ్వాస తీసుకోవడానికి, ఇతర శరీర విధులను నిర్వర్తించడానికి వైద్య సహాయం అవసరం. కొన్నిసార్లు రోగి తమ చుట్టూ ఉన్న శబ్దాలను వినగలుగుతారు కానీ మాట్లాడలేరు. ఈ పరిస్థితి కొన్ని రోజులు లేదా కొన్నిసార్లు యేళ్ల పాటు కొనసాగవచ్చు. అందువల్ల కోమాను ఒక తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు.

కోమా నుంచి బయటకు రావడానికి పట్టే సమయం ఎందుకు మారుతూ ఉంటుంది?

ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగ మాజీ అధిపతి డాక్టర్ దల్జీత్ సింగ్ మాట్లాడుతూ.. కోమా నుండి కోలుకోవడానికి పట్టే సమయం రోగిని బట్టి మారుతూ ఉంటుంది. ఇది మెదడుకు జరిగిన నష్టం తీవ్రత, కోమాకు గల కారణంపై ఆధారపడి ఉంటుంది. మెదడుకు జరిగిన నష్టం స్వల్పంగా ఉండి వెంటనే చికిత్స అందిస్తే, రోగి కొన్ని రోజులు లేదా వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. అయితే మెదడుకు తీవ్రంగా గాయమైనా లేదా ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోయినా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. రోగి వయస్సు, శారీరక పరిస్థితి, ముందు నుంచే ఉన్న అనారోగ్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు రోగి నెమ్మదిగా కోలుకుంటాడు. కాలక్రమేణా అతని ప్రతిచర్యలు మెరుగుపడతాయి. అందువల్ల కోమా నుండి కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.

చికిత్స – సంరక్షణ చాలా ముఖ్యం

కోమా రోగులకు సరైన చికిత్స, నిరంతర సంరక్షణ అవసరం. వైద్యులు మొదట కోమాకు కారణాన్ని నిర్ధారించి దాని ఆధారంగా చికిత్సను ప్రారంభిస్తారు. కొన్నిసార్లు రోగికి వెంటిలేటర్, ఇతర ప్రాణ రక్షణ వ్యవస్థలు అవసరం కావచ్చు. అంతేకాకుండా శరీరంలోని కీలక అవయవాలు సరిగ్గా పనిచేసేలా చేయడానికి మందులు, ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. రోగికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సరైన పోషకాహారం, పరిశుభ్రత వంటివి అందించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు, వైద్య చికిత్సతో రోగి పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us