ఐవీఎఫ్.. చట్టం ఏం చెబుతోంది? దంపతులకు ఏం అర్థమవుతోంది..

సంతానలేమితో బాధపడే జంటలకు ఐవీఎఫ్ ఒక వరం. పెళ్లి తర్వత సహజంగా ప్రయత్నించి సంతానం పొందలేక చాలా మంది జంటలు బాధపడుతూ ఉంటారు. దీని కోసం పలు రకాల చికిత్సలు తీసుకున్నా సరైన ప్రయోజనం ఉండదు. అలాంటి జంటల సంతాన కలను ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వైద్య విధానం సాకారం చేస్తుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఎక్కువగా వాడకంలో ఉన్నది ఈ అధునాతన పద్ధతే కావడం విశేషం.

ఐవీఎఫ్.. చట్టం ఏం చెబుతోంది? దంపతులకు ఏం అర్థమవుతోంది..

Edited By: Gunneswara Rao

Updated on: Jun 12, 2024 | 10:32 AM

ఐవీఎఫ్.. కృత్రిమ గర్భధారణ చికిత్సలో ఇది ఓ మెడికల్ మిరాకిల్. సంతానలేమితో బాధపడే జంటలకు ఒక వరం. పెళ్లి తర్వత సహజంగా ప్రయత్నించి సంతానం పొందలేక చాలా మంది జంటలు బాధపడుతూ ఉంటారు. దీని కోసం పలు రకాల చికిత్సలు తీసుకున్నా సరైన ప్రయోజనం ఉండదు. అలాంటి జంటల సంతాన కలను ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వైద్య విధానం సాకారం చేస్తుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఎక్కువగా వాడకంలో ఉన్నది ఈ అధునాతన పద్ధతే కావడం విశేషం. అయితే ఐవీఎఫ్ విధానం ఎలా జరుగుతుంది? దీనికి ఎంత వరకు ఖర్చు అవుతుంది? దీని సక్సస్‌పై ప్రభావం చూపే అంశాలు ఏంటి? వయో పరిమితికి సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి? తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివాహమైన తర్వాత ఐదు నుంచి 10 ఏళ్ల వరకు సహజంగా గర్భధారణ జరగని పక్షంలో జంటలు ఐవీఎఫ్ విధానాన్ని ఎంచుకోవచ్చు. హార్మోన్ల సమస్య, పిసిఒడి, అండాశయం, గర్భాశయ సంబంధిత వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు కలిగిన మహిళలకు ఐవీఎఫ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే వీర్యం నాణ్యత సరిగ్గా లేకపోవడం, శుక్రకణాల తక్కువగా ఉండటం, శుక్రకణాలు చురుగ్గా కదలకపోవడం వంటి సమస్యలున్న మగవారికి ఈ పద్ధతితో సంతానలేమి సమస్యకు పరిష్కారం లభించవచ్చు. ఐవీఎఫ్ టెక్నాలజీలో భాగంగా మహిళ అండాశయం నుంచి అండాలను సేకరించి ల్యాబ్‌లో వీర్యంతో కలుపుతారు. ఫలదీకరణం తర్వాత, అభివృద్ధి చెందిన పిండాన్ని మహిళల గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఒక్క...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి