Ayurvedic Remedy for Skin: చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే అమ్మమ్మల కాలంనాటి చిట్కా.. నో సైడ్ ఎఫెక్ట్స్‌!

ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన స్క్రబ్‌లను చర్మ కాంతిని పెంచడానికి బలేగా ఉపయోగపడతాయి. వీటిని భారతీయులు శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే అవి వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సహజ ఉత్పత్తుల మిశ్రమం నుంచి తయారవుతాయి కాబట్టి..

Ayurvedic Remedy for Skin: చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే అమ్మమ్మల కాలంనాటి చిట్కా.. నో సైడ్ ఎఫెక్ట్స్‌!
Ayurvedic Remedies For Skin

Updated on: May 01, 2025 | 8:41 PM

అందానికి మెరుగులు దిద్దడానికి అమ్మాయిలు రకరకాల పాట్లు పడుతుంటారు. కొందరు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగితే.. మరికొందరేమో ఇంట్లోనే రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ మార్కెట్లో దొరికే క్రీములు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. అవి చర్మానికి కూడా మంచివి కావు. కానీ ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన స్క్రబ్‌లను చర్మ కాంతిని పెంచడానికి బలేగా ఉపయోగపడతాయి. వీటిని భారతీయులు శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే అవి వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సహజ ఉత్పత్తుల మిశ్రమం నుంచి తయారవుతాయి కాబట్టి. కాబట్టి వీటిని ఎలా ఉపయోగించాలో? చర్మ కాంతిని పెంచడానికి ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రకాశవంతమైన చర్మాన్ని పొందాడానికి మార్కెట్లో దొరికే క్రీములు చర్మాన్ని దెబ్బతీస్తాయి. బదులుగా ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా మెరిసే చర్మాన్ని పొందడానికి సున్ని పిండి ప్రయత్నించండి..

  • సున్ని పిండి ఒక ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం పై పొరను శుభ్రపరుస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలు, మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
  • సున్ని పిండి మీ చర్మానికి మెరుపును ఇస్తుంది. దీనిలోని పసుపు, కుంకుమపువ్వు, శనగపిండి వంటి సహజ పదార్థాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి.
  • సున్ని పిండి చర్మ రంధ్రాల నుంచి మురికి, అదనపు నూనె, ఇతర కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
  • సున్ని పిండిలోని పాలు, పెరుగు లేదా తేనె వంటి సహజ పదార్థాలు చర్మానికి లోతైన తేమను అందించడంలో సహాయపడతాయి.
    సున్ని పిండిలోని మూలికా పదార్థాలు చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడతాయి.

గమనిక: ఈ కంటెంట్‌ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.