
ఆరోగ్యంగా ఉండటానికి, తగినంత విటమిన్లు, ఖనిజాలు ఉండటం చాలా ముఖ్యం. పోషకాలు అధికంగా ఉండే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఒక్క విటమిన్ లోపం కూడా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. విటమిన్ కె ఈ పోషకాలలో ఒకటి. దీని లోపం మీ ఆరోగ్యానికి హానికరం. ఇది మన శరీరంలో అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దీని ప్రాముఖ్యతను విస్మరించకూడదు. అయితే, వివిధ కారణాల వల్ల శరీరంలో లోపం అనేక సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల లోపాన్ని గుర్తించి వెంటనే పరిష్కరించడం చాలా ముఖ్యం. విటమిన్ K లోపం లక్షణాలు, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
విటమిన్ కె అంటే ఏమిటి..? దాని లోపం లక్షణాలు:
విటమిన్ K ఆరోగ్యానికి కీలకమైన విటమిన్, ఎముకలు, గుండె, మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. కాలేయ సమస్యలు, సిర్రోసిస్‌తో బాధపడేవారిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఈ విటమిన్ లోపం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ లక్షణాల ద్వారా మీరు విటమిన్ K లోపాన్ని గుర్తించవచ్చు.
విటమిన్ కె లోపం వల్ల ఎముకల అభివృద్ధి సరిగ్గా లేకపోవడం, ఆస్టియోపొరోసిస్ (ఎముకలు బలహీనపడి, విరిగిపోయే పరిస్థితి) రావచ్చు.
విటమిన్ కె లోపం వల్ల అధిక రక్తస్రావం కావచ్చు.
విటమిన్ కె లోపం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడుము నొప్పి, గాయాలు మానకపోవడం వంటివి విటమిన్ కె లోపం లక్షణాలు కావచ్చు.
విటమిన్ కె లోపం ఉంటే అలసట, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
జుట్టు రాలడం కూడా విటమిన్ కె లోపానికి ఒక సంకేతం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
విటమిన్ K లోపాన్ని భర్తి చేసే ఆహారాలు..
ఆకుకూరలు
ఆవాలు, పాలకూర
గోధుమ, బార్లీ
ముల్లంగి, బీట్‌రూట్
ఎర్ర మిరపకాయ
అరటిపండు
మొలకెత్తిన ధాన్యాలు
జ్యుసి పండ్లు
గుడ్లు
మాంసం
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..