Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు పవర్ పంచ్.. ఈ ఒక్క విటమిన్‌తో.. ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే..

ఈ మధ్య కాలంలో జనాలు ఆనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ఫ్యాటీ లివర్‌ కూడా ఒకటి. జనాల్లో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది, ఇది వృద్ధులు, యువకులను ప్రభావితం చేస్తుంది. ఫ్లోరిడా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రకారం కొన్ని విటమిన్‌లను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఈజీగా ఉపసమనం పొందచ్చని ఆయన చెబుతున్నారు. అదెలానో తెలుసుకుందాం పదండి.

Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు పవర్ పంచ్.. ఈ ఒక్క విటమిన్‌తో.. ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే..
Fatty Liver

Updated on: Nov 20, 2025 | 4:44 PM

మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం ఏం తింటున్నామనేదాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహరపు అలవాట్ల కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి.. ఇటీవల కాలంలో చాలా మంది ఈ సమస్య భారీన పడుతున్నారు. వృద్ధుల నుండి చిన్నవారి వరకు ప్రతి ఒక్కరు ఈ వ్యాధికి ప్రభావితం అవుతున్నారు. అయితే మన రోజువారి ఆహారంలో విటమిన్ ఈ కలిగిన ఆహారం చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్‌పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ ఈ ఎందుకు ముఖ్యమైనది?

ఆహారంలో తగినంత విటమిన్ E తీసుకునే వారికి కాలేయ వ్యాధి, మరి కొన్ని జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. డాక్టర్ సల్హాబ్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కాలేయ సమస్యతో బాధపడేవారిలో చాలా మంది ఈ ఫ్యాటీ లివర్‌ సమస్యనే ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇదే ప్రతి సంవత్సరం అత్యధిక కాలేయ మార్పిడికి కారణమవుతుందని ఆయన తెలిపారు. అయితే, విటమిన్ E అధికంగా ఉండే ఆహారాన్ని మన రోజువారి ఆహరంలో చేర్చుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన చెబుతున్నారు.

ఆహారం వర్సెస్ సప్లిమెంట్స్

విటమిన్ ఈను సప్లిమెంట్స్‌ కంటే.. సహజ వనరుల ద్వారా పొందడమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే వైద్యుడిని సంప్రదించకుండా విటమిన్ E సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుందని.. కాబట్టి ఈ సప్లిమెంట్స్ వాడే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అందుకే సప్లిమెంట్‌ కన్నా.. విటమిన్‌ ఈని ఆహారం ద్వారా పొందడం సురక్షితమైన మార్గమని చెబుతున్నారు.

విటమిన్ ఈ పుష్కలంగా ఉండే ఆహారలు

  • గింజలు, విత్తనాలు: బాదం, హాజెల్ నట్స్, వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, పైన్ గింజలు
  • నూనె: ఆలివ్ నూనె
  • ఆకు కూరలు: పాలకూర, స్విస్ చార్డ్, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్, ఆవాలు గ్రీన్స్
  • పండ్లు: అవకాడో, కివి, మామిడి, బ్లాక్‌బెర్రీ, బొప్పాయి, ఎర్ర బెల్ పెప్పర్
  • చేప: సాల్మన్ మరియు ట్రౌట్

డాక్టర్ సల్హాబ్ ప్రతిరోజూ ఆహారం ద్వారా సుమారు 15 మి.గ్రా. విటమిన్ E తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడమే కాకుండా శరీరం యొక్క సహజ నిర్విషీకరణ ప్రక్రియను కూడా బలపరుస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us