Turmeric Milk: పసుపు కలిపిన పాలు వీరికి విషంతో సమానం.. పొరబాటున కూడా తాగకూడదు

|

Oct 15, 2024 | 8:40 PM

పసుపు కలిపిన పాలు చాలా మంది కాస్త జలుబు చేసినా, దగ్గుగా అనిపించినా తాగేస్తుంటారు. వేడి వేడి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే జలుబు చిటికెలో మాయం అవుతుంది. అయితే..

Turmeric Milk: పసుపు కలిపిన పాలు వీరికి విషంతో సమానం.. పొరబాటున కూడా తాగకూడదు
Turmeric Milk
Follow us on

సాధారణ పాల కంటే పసుపు పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధులకు పసుపు పాలు మంచిదని వైద్యులు చెబుతుంటారు. దీంతో చాలా మంది ప్రతిరోజూ పసుపు పాలు తాగడం తమ దిన చర్యలో భాగంగా అలవాటు చేసుకుంటున్నారు. ఇలా రోజుకొక్క గ్లాసుడు పాలు తాగితే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పసుపులోని ‘కుర్కుమిన్’ కంటెంట్ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాబట్టి సీజన్ మారుతున్నప్పుడు, అంటే వేసవి నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి శీతాకాలం మారేటప్పుడు పసుపును పాలలో కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు, కఫం, జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి మేలే కాదు కీడు కూడా తలపెడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు పసుపు పాలు తాగకూడదు. ఎవరు తినకూడదు? ఎందుకు? వంటి పూర్తి సమాచారం మీ కోసం..

  • పసుపు పాలు ఆరోగ్యానికి వరం అయినప్పటికీ, వీటిని ఎక్కువగా తాగడం వల్ల కొందరి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కంటే ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది.
  • గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి పసుపు పాలు మంచిది కాదు. ఎందుకంటే ఇందులోని పదార్థాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
  • మధుమేహం వంటి సైలెంట్ కిల్లర్ వ్యాధులతో బాధపడేవారు వైద్యులను సంప్రదించకుండా పసుపు పాలను నేరుగా తాగకూడదు.
  • తరచుగా తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి పసుపు పాలు చాలా హానికరం. ఎందుకంటే ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది.
  • కొందరికి పాలతో అలర్జీ ఉంటుంది. ఇటువంటి వారు పసుపు పాలను తాగకుండా ఉండటం మంచిది.
  • వర్షాకాలంలో లేదా చలికాలంలో పసుపు పాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. పసుపు పాలను పరిమితి మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. ఏదైనా సరే పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.