
శరీరంలోని మలినాలను బయటకు పంపి, చర్మానికి నిగారింపును ఇచ్చే ‘పసుపు-అల్లం షాట్’ ఇప్పుడు ఫిట్‌నెస్ ప్రియుల హాట్ ఫేవరెట్. ఈ మ్యాజికల్ డ్రింక్ తయారీ, దీనివల్ల కలిగే అద్భుత లాభాల గురించి తెలుసుకుందాం. అందం కోసం ఖరీదైన క్రీములు వాడుతున్నారా? లేదా ఆరోగ్యం కోసం రకరకాల సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? అయితే మీరు ఒక్కసారి మీ వంటగది వైపు చూడాల్సిందే. అక్కడ ఉండే రెండు సామాన్యమైన పదార్థాలు మీ శరీరంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు. ఒకటి చర్మానికి బంగారు ఛాయను ఇస్తే, మరొకటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రెండింటి కలయికతో చేసే ఒక చిన్న ‘షాట్’ మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుంది. ఆ అద్భుతమైన కాంబినేషన్ మరేదో కాదు.. అదే పసుపు-అల్లం.
ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు తీసుకుని, అందులో ఒక టీస్పూన్ పసుపు, ఒక అంగుళం మేర దంచిన తాజా అల్లం ముక్క వేయాలి. దీనికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాల పొడి జోడించాలి. రుచి కోసం ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. అన్నింటినీ బాగా కలిపి, వడపోసుకుని వెంటనే తాగేయాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ షాట్ తీసుకుంటే ఫలితాలు చాలా వేగంగా కనిపిస్తాయి.
ఈ పసుపు-అల్లం షాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొందరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిత్తాశయ సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు దీనికి దూరంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు వైద్యుల సలహా తీసుకున్నాకే దీనిని ప్రారంభించాలి. ప్రకృతి ఇచ్చిన ఈ చిన్నపాటి చిట్కాలే మనల్ని పెద్ద రోగాల నుండి కాపాడతాయి.