
వర్షాకాలం మొదలైంది. దీంతో శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఉదయం జలుబు, గొంతు నొప్పి బాధపెడుతుంది. అలాంటి పరిస్థితిలో ఇంట్లో ఉండే రెండు ఔషధ పదార్థాలు – ఎండిన అల్లం (సొంటి), తులసి మీకు ఉపశమనం కలిగిస్తాయి. వీటితో తయారుచేసిన టీ రుచికరమైనది మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒక అద్భుతమైన గృహ నివారణ కూడా.
తయారుచేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు నీరు అందులో వేయండి. ఇపుడు ఆ నీటిలో తులసి ఆకులు, సొంటి పొడిని వేయండి. టీ రుచిని కోరుకుంటే.. అందులో కొన్ని టీ ఆకులను జోడించండి.
తక్కువ మంట మీద 5-7 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు గ్యాస్ ఆపివేసి టీని ఫిల్టర్ చేయండి. టీ కొద్దిగా గోరువెచ్చగా మారినప్పుడు.. అందులో తేనె జోడించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)