ఈ పచ్చటి ఆకులతో తయారైన ఆయుర్వేద ఫేస్‌ ప్యాక్‌.. మీ ముఖాన్ని చంద్రబింబంలా మారుస్తుంది..!

| Edited By: Ravi Kiran

Aug 26, 2023 | 9:49 PM

ప్రస్తుతం చాలా మంది మహిళలు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ తులసి ఒక గొప్ప చర్మ సంరక్షణిగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా..? తులసితో ఫేక్‌ ప్యాక్‌ తయారీ. దీని కోసం, వేప, తులసి ఆకులు, 2-3 లవంగాలను పేస్ట్‌గా చేసి ముఖానికి రాయండి. ఆ తర్వాత ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
తులసి ఆకులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు నయమవుతాయని పలువురు చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. తులసి, నారింజ తొక్కతో  తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ మొటిమలను తొలగిస్తుంది. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.

2 / 6
దీని కోసం తులసి ఆకుల పొడి, నారింజ తొక్కల పొడిని కలుపుకోవాలి. ఇప్పుడు దానికి పాలు, తేనె కలపాలి. ఫేస్ ప్యాక్ సిద్ధమైన తర్వాత, ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి.

3 / 6
తులసిలో లాగానే వేప ఆకుల్లో కూడా ఆయుర్వేద గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ రెండు రకాల ఆకులను మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా పెరగడం ఆగిపోయి మొటిమలు రావడం తగ్గిపోతుంది.

4 / 6
దీని కోసం, వేప, తులసి ఆకులు, 2-3 లవంగాలను పేస్ట్‌గా చేసి ముఖానికి రాయండి. సుమారు 30 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగాలి.

5 / 6
తులసి, పెరుగు కలిపిన ఫేస్ ప్యాక్ మీకు చర్మానికి నిగారింపునిస్తుంది. చర్మానికి శుభ్రపరిచే ప్రభావాన్ని అందిస్తుంది. నిర్జీవంగా మారిన ముఖ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. దీని కోసం కొన్ని తులసి ఆకులను పూర్తిగా ఎండలో ఆరబెట్టుకోవాలి.  ఆకులు బాగా ఎండిన తర్వాత ఎండు ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి.

6 / 6
ఆ తర్వాత ఒక గిన్నెలో 3 టీస్పూన్ల తులసి ఆకుల పొడి, ఒక టీస్పూన్ పెరుగు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వండి.  చివరగా శుభ్రమైన నీటితో కడగాలి.