Karthika Masam: శివయ్య భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే పంచారామ క్షేత్రాల దర్శనం

|

Nov 17, 2023 | 12:45 PM

కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. భక్తుల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీఎస్ ఆర్టీసీ భక్తులకు అందుబాటు లో గుంటూరు, విజయనగరం వంటి అనేక ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను నడపడానికి.. స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

Karthika Masam: శివయ్య భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే పంచారామ క్షేత్రాల దర్శనం
Pancharama Kshetralu
Follow us on

హిందువులు కార్తీక మాసాన్ని ఆధ్యాత్మిక మాసంగా భావిస్తారు. శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు, ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో శివుడి పూజకు ఎంతో ప్రాముఖ్యానిస్తారు. ఈ నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు మాత్రమే కాదు శివాలయాలకు కూడా భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా ఏపీలోని పంచారామాలు భక్తులతో సందడి నెలకొంటుంది. తెలుగు వారు ఈ పంచారామ క్షేత్రాలను దర్శించి శివయ్యను పూజించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ పంచారామ క్షేత్రాలను ఈజీగా దర్శించుకునే విధంగా స్పెషల్ టూర్ ప్యాకేజీని వివిధ ప్రాంతాల నుంచి ప్రకటించింది.

కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. భక్తుల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీఎస్ ఆర్టీసీ భక్తులకు అందుబాటు లో గుంటూరు, విజయనగరం వంటి అనేక ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను నడపడానికి.. స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

గుంటూరు నుంచి

పంచారామ శైవ క్షేత్రాలకు APSRTC గుంటూరు 2 డిపో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సులు గుంటూరు బస్టాండ్‌లో శనివారం (నవంబర్ 18) రాత్రి 9:15 గంటలకు, ఆదివారం (నవంబర్ 19) రాత్రి 9:15 గంటలకు బయలుదేరనున్నాయి. ఈ ప్రత్యేక బస్సులు అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత రెండో రోజు ఉదయం 9 గంటలకు గుంటూరుకు తిరుగు ప్రయాణమవుతాయి. ఈ బస్సులకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం ఉంది. అల్ట్రా డీలక్స్ రూ.1130 , సూపర్ లక్సరీ కి రూ.1180. భక్తులు ముందుగానే తమ టికెట్ లని బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించినట్లు గుంటూరు డిపో మేనేజర్ వెల్లడించారు.

విజయనగరం నుంచి

పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు విజయనగరం నుంచి రెండు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు విజయనగరం డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రికులు ఈ ప్యాకేజీలో అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, భీమవరం, సామర్లకోట శివాలయాలను సందర్శించి సురక్షితంగా తిరిగి స్వస్థలానికి చేరుకోవాక్సచ్చు. భక్తులు బృందంగా ఏర్పడి యాత్రకు వెళ్లాలనుకుంటే  బస్సు మొత్తం బుక్ చేసుకుని హాయిగా ప్రయాణించవచ్చు.

టూర్ ప్యాకేజీ బస్సులు నవంబర్ 19, 26 ఆదివారాలు , డిసెంబర్ 3, 10 తేదీల్లో ప్రారంభమవుతాయి. ఈ సర్వీసుల కోసం ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పంచారామ శైవ క్షేత్రాల్లో మొదటిది కుమారరామం. కాకినాడ కు దగ్గరలోని సామర్లకోటలోఉంది. రెండవ క్షేత్రం ద్రాక్షారంలోని భీమారామం. మూడవది క్షీరారామం. పాలకొల్లులో ఉంది. నాలుగవది భీమవరంలోని  సోమారామం. ఐదవది అమరారామం. అమరావతిలో అమరలింగేశ్వరుడుగా శివయ్య భక్తులను అనుగ్రహిస్తున్నాడు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..