IRCTC Tour Package: వైష్ణో దేవి దర్శనం చేసుకోవాలని అనుకునే భక్తుల కోసం ఐఆర్‌టీసీ స్పెషల్ టూర్ టూర్ ప్యాకేజీని రిలీజ్ చేసింది. ఆ తల్లిని దర్శించుకోవలనుకునేవారికి ఇది చక్కని అవకాశం.. తక్కువ ధరతో ఐఆర్‌టీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తక్కువ బడ్జెట్ తో మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు ఉంటుంది. మాత దర్శనం కోసం ప్రతి వ్యక్తికి ఈ ప్యాకేజీలో రూ .5800లకే అందిస్తోంది. అయితే ఈ టూర్ లో ప్రయాణం ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..
ఐఆర్‌టీసీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఒక వ్యక్తి రూ .5795 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ లో వైష్ణవి దేవిని దర్శించుకోవలనుకునేవారు ముందుగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ప్రయాణీకులను ఏసీ త్రీ టైర్‌లో జమ్మూకు తీసుకుని వెళ్తారు. రెండవ రోజు జమ్మూ నుండి నాన్-ఏసీ రైలులో ప్రయాణీకులను జమ్మూ నుండి కాట్రాకు తీసుకువెళతారు. కాట్రా చేరుకున్న అనంతరం ప్రయాణీకులు యక్షి సరస్వతి ధామ్ వద్ద ఆగి ట్రావెల్ స్లిప్ తీసుకోవాల్సి ఉంటుంది. హోటల్‌లో బస చేసిన అనంతరం అల్పాహారం అందిస్తారు. చివరికి వారి ప్రయాణం మూడో రోజు ప్రారంభమవుతుంది. అమ్మ దర్శనం అనంతరం జమ్మూకి తీసుకుని వస్తారు. అక్కడ నుండి ఢిల్లీకి తిరిగి చేరుస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ గురించి మరింత సంచారం తెలుసుకోవాలంటే..ఐఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Travel to #Mata #VaishnoDevi‘s Temple nestled in the mountains of #Katra & let the divine energy wash over you. To know more about this 4D/3N all-incl. tour package, visit https://t.co/xPZNWkg7YO
— IRCTC (@IRCTCofficial) October 14, 2021
ఉత్తరాఖండ్‌లో రికార్డ్ స్థాయిలో వర్షాలు.. 47 మంది మృతి.. తాజా పరిస్థితిపై ఆరాతీసిన ప్రధాని మోడీ