IRCTC Tour: వేసవిలో ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా .. తక్కువ ధరలో IRCTC టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

|

Mar 25, 2023 | 1:33 PM

మార్చి 28న ప్రారంభమై జూన్ 27 వరకు కొనసాగనున్న ఈ టూర్ ప్యాకేజీ 6 పగలు, 5 రాత్రుల ట్రిప్‌గా ఉంటుంది. టూర్ ప్యాకేజీ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా IRCTC అందిస్తుంది. ఒకొక్కరికి రూ. 9,280లకు అందిస్తుంది. 

IRCTC Tour: వేసవిలో ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా .. తక్కువ ధరలో IRCTC టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Ooty From Hyderabad
Follow us on

వేసవి వచ్చిందంటే చాలు.. చల్లదనం కోసం చూస్తూ ఉంటారు. అలసిన శరీరం , పిల్లల సెలవులతో మంచి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళడానికి పర్యాటకులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవి వస్తే.. మనసు ఉదకమండలంపై పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగువారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC ) మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది.  హైదరాబాద్ నుండి  సుందరమైన హిల్ స్టేషన్‌ ఊటీకి కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ఈ ప్యాకేజీ పర్యాటకులకు ఊటీ  సహా చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లోని సుందరమైన అందాలను అన్వేషించే అవకాశాన్ని కలిపిస్తుంది. అదే సమయంలో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన.. ఎటువంటి అవాంతరాలు లేని ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

మార్చి 28న ప్రారంభమై జూన్ 27 వరకు కొనసాగనున్న ఈ టూర్ ప్యాకేజీ 6 పగలు, 5 రాత్రుల ట్రిప్‌గా ఉంటుంది. టూర్ ప్యాకేజీ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా IRCTC అందిస్తుంది. ఒకొక్కరికి రూ. 9,280లకు అందిస్తుంది.

ఈ ప్యాకేజీలో భాగంగా రైలులో ప్రయాణం.. ప్రీమియం హోటల్‌లో వసతి, క్యాబ్ సౌకర్యం, భోజనం, ఊటీ..  చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలల్లో సందర్శన పర్యటనలు ఉన్నాయి.

ఊటీలోని ప్రసిద్ధ సరస్సు సందర్శనను కల్పిస్తుంది. ఈ సరస్సులో పర్యాటకులు వేడి నుంచి సేదదీరుతూ.. బోటింగ్,  ఇతర జల క్రీడలను ఆస్వాదించవచ్చు, అలాగే అనేక రకాల  ప్రపంచంలోని వృక్షజాలం, జంతుజాలానికి నిలయమైన అద్భుతమైన బొటానికల్ గార్డెన్స్‌లో విహారయాత్ర చేయవచ్చు. టూర్ ప్యాకేజీలోని ఇతర ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటి నీలగిరి కొండలలోని ఎత్తైన ప్రదేశమైన దొడ్డబెట్ట శిఖరాన్ని సందర్శించడం.. అందమైన పైకారా జలపాతాన్ని సందర్శించడం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..