IRCTC: ప్రకృతి అందాల కేరళ చూసొద్దాం పదండి.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీతో తక్కువ ధరలోనే..

|

Nov 12, 2023 | 9:42 PM

'కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌' పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ కొత్త టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి కేరళకు ఈ టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ టూర్‌ ఉండనుంది. టూర్‌ ప్యాకేజీలో భాగంగా మున్నార్‌, అలెప్పీతో పాటు పలు ప్రకృతి రమణీయ ప్రాంతాలు కవర్‌ అవుతాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. ఇంతకీ 'కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌' టూర్‌ ప్యాకేజీలో ఏయే...

IRCTC: ప్రకృతి అందాల కేరళ చూసొద్దాం పదండి.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీతో తక్కువ ధరలోనే..
Kerala
Follow us on

ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతానికి సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా చలి కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు కూడా కేరళను సందర్శించాలనుకుంటున్నారా.? మీ కోసమే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది.

‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌’ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ కొత్త టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి కేరళకు ఈ టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ టూర్‌ ఉండనుంది. టూర్‌ ప్యాకేజీలో భాగంగా మున్నార్‌, అలెప్పీతో పాటు పలు ప్రకృతి రమణీయ ప్రాంతాలు కవర్‌ అవుతాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. ఇంతకీ ‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌’ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

మొత్తం 5 రాత్రులు, 6 రోజులపాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీ నంబర్‌ 21వ తేదీన అందుబాటులో ఉండనుంది. టూర్‌లో భాగంగా మొదటి రోజు అంటే నవంబర్‌ 21వ తేదీన.. మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేసి.. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్‌ వెళ్తార. అనంతరం అక్కడ హోటల్‌లోకి చెక్‌ ఇన్‌ అయిన తర్వాత.. సాయంత్రం మున్నార్ పట్ణణాన్ని వీక్షిస్తారు. రాత్రి బస మున్నార్‌లోనే ఉంటుంది.

4వ రోజు హోటలల్‌లో టిఫిన్‌ చేసిన తర్వాత అలెప్పీకి వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెకిన్‌ అయిన తర్వాత బ్యాక్‌ వాటర్‌ సందర్శన ఉంటుంది. రాత్రి అలెప్పీలోనే బస ఉంటుంది. 5వ రోజు హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అయ్యి.. ఎర్నాకులం వస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.20 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మరునాడు అంటే 6వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుగస్తుంది.

ఇక టూర్‌ ప్యాకేజీ విషయాకొస్తే.. సింగిల్‌ షేరింగ్ రూ. 33,480, డబుల్ షేరింగ్‌కు రూ. 19,370గా నిర్ణయించారు. ఇక ట్రిపుల్‌ షేరింగ్ విషయానికొస్తే రూ. 15,580గా ఉంది. ఇవి కంఫార్ట్ క్లాస్‌ 3ఏ టికెల్ వివరాలు. స్టాండర్డ్‌ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ. 30,770గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేక ధరలు ఉంటాయి. పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్‌ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..