
ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ స్పెషల్ ట్రైన్ అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి తంజావూరు వంటి ప్రముఖ క్షేత్రాలను కవర్ చేస్తుంది. మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను అధికారులు నిర్ణయించారు.ఈ ప్యాకేజీ వివరాలు మరిన్ని తెలుసుకుందాం..
టికెట్ ధరలు, క్లాస్ వివరాలు:
ఎకానమీ క్లాస్: పెద్దలకు రూ.14,700, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.13,800.
కంఫర్ట్ క్లాస్: పెద్దలకు రూ.28,700, పిల్లలకు రూ.27,400.
యాత్ర సాగేది ఇలా :
ప్రారంభం: ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది.
ముఖ్య స్టేషన్లు: జనగామ, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. భక్తులు తమకు అనువైన స్టేషన్‌లో రైలు ఎక్కవచ్చు.
దర్శనీయ క్షేత్రాలు:
డే 2: అరుణాచలం ఆలయ దర్శనం.
డే 3, 4: రామేశ్వరం దర్శనం మరియు మధురై ప్రయాణం.
డే 5: కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, సన్ సెట్ పాయింట్ సందర్శన.
డే 6: త్రివేండ్రం శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్.
డే 7: తంజావూరు బృహదీశ్వర ఆలయ దర్శనం.
ఎనిమిదో రోజు రాత్రి 9 గంటలకు రైలు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.