IRCTC: కేరళ అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 7 రోజుల సూపర్ టూర్ ప్యాకేజీ!

Hyderabad to Kerala IRCTC Tour Package: హైదరాబాద్ నుంచి కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించే 7 రోజుల ప్రత్యేక టూర్ అందుబాటులోకి వచ్చింది. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, మునార్ హిల్ స్టేషన్, అలెప్పీ హౌస్‌బోట్, శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంతో పాటు కొచ్చి, కుమరకోం, త్రివేండ్రం వంటి ప్రదేశాలను ఒకే ప్యాకేజీలో సందర్శించే అవకాశం లభించనుంది.

IRCTC: కేరళ అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 7 రోజుల సూపర్ టూర్ ప్యాకేజీ!
Hyderabad to Kerala 7-Day Tour Package

Updated on: Jul 16, 2026 | 4:21 PM

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, బ్యాక్‌వాటర్స్, కొండ ప్రాంతాలు.. ఇవన్నీ ఒకే యాత్రలో చూడాలనుకునే ప్రయాణికులకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక 7 రోజుల కేరళ టూర్‌లో రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించారు. విమాన ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక రవాణా వంటి సదుపాయాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

ఏయే ప్రాంతాలను సందర్శిస్తారు?

ఈ యాత్రలో కొచ్చి, గురువాయూర్, మునార్, కుమరకోం, అలెప్పీ, త్రివేండ్రం వంటి కేరళలోని ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, త్రివేండ్రంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మరోవైపు మునార్ టీ తోటలు, అలెప్పీ బ్యాక్‌వాటర్స్, కుమరకోం హౌస్‌బోట్ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి.

టూర్ వ్యవధి

ఈ ప్రత్యేక యాత్ర మొత్తం 7 రోజుల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 3న హైదరాబాద్ నుంచి ప్రారంభమై, ఆగస్టు 9న ముగుస్తుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చికి విమానంలో చేరుకుని, చివరగా త్రివేండ్రం నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.60,700
  • డబుల్ షేరింగ్: రూ.44,000 (వ్యక్తికి)
  • ట్రిపుల్ షేరింగ్: రూ.41,000 (వ్యక్తికి)
  • 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో: రూ.34,600
  • 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా: రూ.30,600
  • 2 నుంచి 4 ఏళ్ల చిన్నారులకు: రూ.19,900

రోజు వారీ ప్రయాణ వివరాలు

  1. మొదటి రోజు: హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో కొచ్చి చేరుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం విశ్రాంతి తీసుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం డచ్ ప్యాలెస్, మెరైన్ డ్రైవ్ వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రికి కొచ్చిలోనే బస ఉంటుంది.
  2. రెండో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత అతిరప్పల్లి జలపాతాన్ని సందర్శిస్తారు. అనంతరం గురువాయూర్ చేరుకుని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకుంటారు. సాయంత్రానికి తిరిగి కొచ్చి చేరుకుని అక్కడే బస చేస్తారు.
  3. మూడో రోజు: హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి మునార్‌కు బయలుదేరుతారు. మార్గమధ్యంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మెట్టుపట్టి డ్యాంను సందర్శిస్తారు. రాత్రికి మునార్‌లో బస ఉంటుంది.
  4. నాలుగో రోజు: మునార్ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను రోజంతా సందర్శిస్తారు. టీ తోటలు, వ్యూపాయింట్లు, స్థానిక ఆకర్షణలు ఈ రోజు ప్రత్యేకంగా ఉంటాయి. రాత్రికి మునార్‌లోనే బస.
  5. ఐదో రోజు: మునార్ నుంచి కుమరకోం చేరుకుంటారు. అక్కడి నుంచి హౌస్‌బోట్‌లో బ్యాక్‌వాటర్స్ విహారం ఉంటుంది. హౌస్‌బోట్‌లోనే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు. అలెప్పీ బ్యాక్‌వాటర్స్ అందాలను దగ్గరగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
  6. ఆరో రోజు: కుమరకోం నుంచి త్రివేండ్రం బయలుదేరుతారు. మార్గమధ్యంలో అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం త్రివేండ్రంలో హోటల్‌లో బస చేస్తారు.
  7. ఏడో రోజు: ఉదయం శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, అల్పాహారం అనంతరం నేపియర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో ఏడు రోజుల కేరళ యాత్ర ముగుస్తుంది.

ప్రకృతి, ఆధ్యాత్మికత, విశ్రాంతి, హౌస్‌బోట్ అనుభవం, హిల్ స్టేషన్ సందర్శన… ఇలా ఒకే ప్యాకేజీలో కేరళ ప్రత్యేకతను ఆస్వాదించాలనుకునే వారికి ఈ టూర్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us