Venkata Narayana |
Feb 26, 2021 | 9:32 PM
విభిన్నజాతులు, మతాలకు నెలవై వైవిధ్యాలకు కొలువైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి. అనాదిగా వస్తోన్న ఈ కళల్లో ప్రతీది ప్రత్యేకమే. కర్నాటకలో హస్తకళల అభివృద్ధికి విశేషంగా కృషి జరుగుతోంది.
హస్తకళల అభివృద్ధి చేయడంలో భాగంగా షిమోగా జిల్లా సాగర్ దగ్గరనున్న గురుకుల్ విద్యార్థులు చేసిన హస్తకళలు ఇవి. ఈ విద్యార్థులకు రెండు సంవత్సరాల వ్యవధిలో శిక్షణ ఇస్తారు.
కర్నాటక హస్తకళల అభివృద్ధి సంస్థ ఈ వర్ధమాన శిల్పకారులను తీర్చి దిద్దడంలో గర్వకారణంగా నిలుస్తుందని కర్నాటక హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఎండీ, ఐపీఎస్ అధికారిని రూపా తెలిపారు.
కర్నాటక హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఎండీ, ఐపీఎస్ అధికారిని రూపా ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉత్పత్తులను మీరు మరెక్కడా కనుగొనలేరని నేను పందెం వేస్తున్నాను అంటూ చెప్పారామె. ఇదే హస్తకళల పట్ల ఆమెకున్న చిత్తశుద్ధికి నిదర్శనం