Gandikota Tourism: గండికోట వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అడ్వెంచర్ గేమ్స్, హెలికాఫ్టర్ షికారుతో ఫుల్ మస్తీ..

Gandikota Utsavalu 2026: ఏపీ పర్యాటక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన గండికోట ఉత్సవాలకు వచ్చే టూరిస్ట్‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. గండికోట ఆందాలను తిలంకించందుకు హెలీరైడ్‌తో పాటు ప్యారాగ్లైడింగ్‌ రైడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే రకరకాల అడ్వేంచర్ గేమ్స్‌ను కూడా సిద్దం చేసింది. ఈ సంక్రాంతి సెలవుల్లో మీరెవైనా ట్రిప్‌లకు ప్లాన్ చేస్తుంటే గండికోట మీకు బెస్ట్ విసిజ్ అవుతుందంటున్నారు ఏపీ టూరిస్ట్‌లు.

Gandikota Tourism: గండికోట వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అడ్వెంచర్ గేమ్స్, హెలికాఫ్టర్ షికారుతో ఫుల్ మస్తీ..
Gandikota Utsavalu

Edited By:

Updated on: Jan 11, 2026 | 11:37 AM

ఏపీలోని గండికోట అందాలను తిలంకించేందుకు వెళ్లే టూరిస్ట్‌లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ టూరిస్ట్‌ స్పాట్‌లలో ఒకటైన గండికోటలో మూడు రోజులపాటు అడ్వెంచర్ గేమ్స్‌ను సిద్ధం చేసింది. గండికోట ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రభుత్వం హెలి రైడ్, ప్యారాగ్లైడింగ్‌ రైడ్‌లను సిద్ధం చేసినట్టు తెలిపింది.

కడప జిల్లాలో ఉన్న గండికోటకు ఎంతో విశిష్టత ఉంది. గండికోట రహస్యం లాగే ఇక్కడ అనేక విశేషాలు ఉన్నాయి. ఇండియన్ గ్రాండ్ కెనాన్ గా పిలవబడే ఈ ప్రాంతం చూడ్డానికి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. రెండు కొండల మధ్య ఎత్తైన లోయ ప్రాంతం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యం ఆనవాళ్లు, కాకతీయుల ఉనికి, నిజాములు, సుల్తానుల పాలనకు నిలువుటద్దంగా నిలుస్తుంది ఈ గండికోట ప్రాంతం. అందుకే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ నెల 11, 12, 13 తేదీలలో ఉత్సవాల నిర్వహిస్తుంది.

ఈ ఉత్సవాలలో భాగంగా గండికోట ప్రాంతానికి వచ్చే టూరిస్ట్‌ల కోసం హెలికాప్టర్ రైడ్స్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా పారా రైట్ కూడా ఉంటుంది. దానితోపాటు వాటర్ స్పోర్ట్స్, జిప్ లైన్ వంటి అనేక అడ్వెంచర్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు సినీ ప్రముఖలతో ఇక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వం, మంగ్లీ వంటి ప్రముఖ సింగర్స్‌తో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది. ఈ సంక్రాంతి సెలవుల్లో ట్రిప్‌ వెళ్లాలనుకునే వారికి గంటికోట విజిట్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.