
హైదరాబాద్ లోని అత్యంత రిచెస్ట్ ప్లేసెస్ లో బేగం పేట్ కూడా ఒకటి. హైదరాబాద్ నడిబొడ్డున ఉండటం దీనికి కలిసొచ్చిన అంశం. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం మోడర్న్ హంగులు కూడా కలగలుపుకుని సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆరవ నిజాం కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం పేరు మీద దీనికి ఈ పేరు పెట్టారు. ఆమె ఈ ప్రాంతాన్ని తన పెళ్లిలో కట్నకానుకల్లో భాగంగా పొందింది. బేగంపేటకు నగరం రాచరికతకు గతంతో లోతైన సంబంధం ఉంది. ఇది కేవలం వారసత్వం మాత్రమే కాదు.. ఈ ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్ లు మోడర్న్ కేఫ్ లతో పాటు ఎంటర్టైన్మెంట్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే ప్రదేశాలను కూడా తన సిగలో ఇముడ్చుకుంది. అందుకే నిత్యం ఇక్కడ టూరిస్టులతో పాటు నగరవాసుల సందడితో కళకళలాడుతుంటుంది.
పైగా కుటుంబం నిర్మించిన అద్భుతమైన రాజభవనం ఇది. దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా దీన్ని నిర్మించారు. రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. ఒక్కో అంతస్తులో 20 గదులుంటాయి. ఇక్కడి బాత్రూంలు విస్తీర్ణం 300 అడుగులతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
పాజ్ లైబ్రరీ.. పాజ్ ఫర్ పెర్స్పెక్టివ్ అనే మానసిక ఆరోగ్య సంస్థతో కలిసి ఇది పనిచేస్తుంది. సందర్శకులకు స్వీయ-అవగాహన, మానసిక ఆరోగ్యం గురించి వివరించే వివిధ రకాల చిత్ర పుస్తకాలు, అధ్యాయ పుస్తకాలను అందిస్తుంది. లైబ్రరీలో పాజ్ కేఫ్ కూడా ఉంది. మూవీ నైట్స్, సపోర్ట్ సెషన్‌లు, రీడీంగ్ సెషన్‌లు వంటి కార్యక్రమాలను ఇది నిర్వహిస్తుంది.
ఒక శతాబ్దం క్రితం స్థాపించబడిన మ్యూసీ మ్యూజికల్ ఒక చారిత్రాత్మక వర్క్ షాప్. ఇది సంగీత వాయిద్యాలను అందించడమే కాకుండా ఏ రకమైన వాయిద్యానికైనా పాశ్చాత్య శాస్త్రీయ, రాక్, భారతీయ శాస్త్రీయ సంగీత క్లాస్ లను కూడా అందిస్తుంది.
మూరిష్ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందిన స్పానిష్ మసీదు హైదరాబాద్‌లోని అత్యంత ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం. తెల్లని మినార్లు ఇక్కడి అద్భుతం. క్లిష్టమైన ఇస్లామిక్ డిజైన్లు మరింత ఆకర్షణగా నిలుస్తాయి.
1928లో స్థాపించబడిన డెక్కన్ పెన్ స్టోర్ చరిత్ర పాఠాలతో పాటు మంచి షాపింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. వేలకు పైగా పెన్నులతో, ఐకానిక్ స్టోర్ ఫౌంటెన్ పెన్నులు, చేతితో తయారు చేసిన పెన్నులను ఇక్కడ చూడొచ్చు. పెన్నులను రిపేర్ చేసే దుకాణాలు కూడా మీరిక్కడ చూడొచ్చు. వీటి ధరలు రూ. 10 నుండి ప్రారంభమై రూ. 3 లక్షల వరకు ఉంటాయి.
ఇక్కడున్న ఎస్కేప్ రూమ్ ను మీరు కచ్చితంగా చూసిరండి. వినోదం కోరుకునే వారికి ఇదొక మంచి అనుభూతిని ఇస్తుంది. ఉత్కంఠభరితమైన మిస్టరీ గేమ్‌లను ఇక్కడ ఆడొచ్చు. ఎస్కేప్ రూమ్ నుంచి పజిల్స్, క్లూస్ ను ఆధారం చేసుకుని తప్పించుకోవాలి. స్నేహితులతో కలిసి వెళ్లడానికి ఇదొక మంచి ప్లేస్.
బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో ఫన్నెల్ హిల్ క్రీమరీ, కాంకు, ది బార్ ప్రాజెక్ట్, ట్రీహౌస్ కేఫ్, కొలిబా, ప్లాన్ బి వంటి కొన్ని ఉత్సాహభరితమైన కేఫ్‌లు ఉన్నాయి. వీటిలో మీ టైమ్ ను స్పెండ్ చేయొచ్చు.
ఒకప్పుడు హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయంగా ఉన్న బేగంపేట విమానాశ్రయం ఇప్పుడు విమానయాన ప్రదర్శనలు, వైమానిక ప్రదర్శనలు, అధికారిక వైమానిక దళ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంవత్సరానికి ఒకసారి జరిగే వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో ఇక్కడ చాలా ఫేమస్.
ఈ ప్రాంతంలో డెక్కన్ పెవిలియన్- ఐటీసీ కాకతీయ, తత్వా రెస్టారెంట్, ఓహ్రీస్ ఈట్ మోర్, సాఫ్రాన్ సోల్, హైదరాబాద్ హౌస్ వంటి అద్భుతమైన భోజన రెస్టారెంట్లున్నాయి.
బేగంపేటలోని కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ లు ఎంతో ఫేమస్. లైఫ్ స్టైల్ స్టోర్స్, షాపర్స్ స్టాప్, వెస్ట్ సైడ్, హైదరాబాద్ సెంట్రల్ వంటివి మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి.