Lifestyle: డయాబెటిస్‌కు ఇది కూడా ఓ కారణమే.. పరిశోధనలో సంచలన విషయాలు

|

Apr 02, 2024 | 9:34 PM

అయితే తాజాగా పరిశోధకులు మరో కారణాన్ని గుర్తించారు. టైప్‌2 డయాబెటిస్‌కు బద్ధకంతో కూడుకున్న జీవన విధానం, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కాకంకుడా స్మోకింగ్ కూడా ఓ కారణమని చెబుతున్నారు. పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా తల్లి కడుపులో ఉండగా...

Lifestyle: డయాబెటిస్‌కు ఇది కూడా ఓ కారణమే.. పరిశోధనలో సంచలన విషయాలు
Diabetes
Follow us on

డయాబెటిస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపించడం కలవరపెడుతోంది. డయాబెటిస్‌కు ఎన్నో రకా కారణాలు ఉంటాయని మనకు తెలిసిందే. తీసుకునే ఆహారం మొదలు, మారిన జీవన విధానం, కుటుంబంలో ఇతరులకు ఈ వ్యాధి ఉండడం ఇలా ఎన్నో కారణాలు డయాబెటిస్‌కు కారణమవుతుందని తెలిసిందే.

అయితే తాజాగా పరిశోధకులు మరో కారణాన్ని గుర్తించారు. టైప్‌2 డయాబెటిస్‌కు బద్ధకంతో కూడుకున్న జీవన విధానం, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కాకంకుడా స్మోకింగ్ కూడా ఓ కారణమని చెబుతున్నారు. పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా తల్లి కడుపులో ఉండగా పొగాకు ప్రభావానికి గురైనవారికి.. బాల్యంలో లేదా యుక్తవయసులో సిగరెట్లు తాగటం మొదలెట్టిన వారికి పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశమున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది.

స్మోకింగ్ చేసే వారికి డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యాయనంలో తేలింది. చైనాకు చెందిన షాంఘై జియావో టాంగ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం వీరు బ్రిటన్‌ బయోబ్యాంకులో ఉన్న 4.76 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.

కడుపులో ఉన్నప్పుడు పొగాకు ప్రభావానికి గురైతే టైప్‌2 డయాబెటిస్‌కు గుయ్యే అవకాశం 22 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇక పొగతాగే అలవాటు లేనివారితో పోలిస్తే యుక్తవయసులో సిగరెట్లు కాల్చటం మొదలెట్టినవారికి డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు 57% ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే మొదట్లో పొగాకు ప్రభావానికి గురైనా తర్వాత సరైన జీవనశైలి పాటించిన వారిలో మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.