Lifestyle: బరవు తగ్గాలనుకుంటున్నారా.? వాసన పీల్చుకోండి చాలు..

|

Sep 17, 2024 | 10:52 AM

ఇటీవల ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇక అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామాలు మొదలు డైటింగ్ వరకు ఎన్నో పనులు చేస్తుంటారు. అయితే కేవలం వాసన పీల్చుకోవడం ద్వారా...

Lifestyle: బరవు తగ్గాలనుకుంటున్నారా.? వాసన పీల్చుకోండి చాలు..
Weight Loss
Follow us on

ఇటీవల ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇక అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామాలు మొదలు డైటింగ్ వరకు ఎన్నో పనులు చేస్తుంటారు. అయితే కేవలం వాసన పీల్చుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా.? వాసన పీల్చుకుంటే బరువు ఎలా తగ్గుతారనే ఆలోచిస్తున్నారు కదూ! అయితే కొన్న అధ్యయనాల్లో తేలిన విషయాల ప్రకారం కొన్ని రకాల వాసనలు పీల్చుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాసనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పుదీనా వాసనను పీల్చుకోవడం వల్ల జీవక్రియ మెరుగువుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ వాసనకు ఉందని నిపుణులు చెబుతుంటారు. పిప్పర్‌మెంట్ నూనె ట్రిజెమినల్ నరాల ఉద్దీపనకు కారణమవుతుంది. ఎప్పుడైనా దిగాలుగా అనిపించినప్పుడు ఈ ఆకుల వాసన చూస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

* స్మెల్‌ అండ్‌ టేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో బరువు తగ్గించడంలో గ్రీన్‌ యాపిల్‌ వాసన ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు గ్రీన్ యాపిల్‌ లేదా అరటిపండ్ల వాసన చూస్తే ఆకలి భావన తగ్గుతుందని ఇది ఇన్‌డైరెక్ట్‌గా బరువు తగ్గడంలో దోహదపడుతుందని అంటున్నారు.

* నారింజ పండ్ల తొక్క వాసనను చూడడం ద్వారా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా భోజనం చేసే ముందు వీటి వాసన చూస్తే ఆకలి తగ్గుతుందని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు.

* ఘాటుగా ఉండే వెల్లుల్లి వాసనను పీల్చుకోవడం వల్ల తక్కువ మొత్తం ఆహారాన్ని తీసుకునేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. లేవర్‌ జర్నల్‌లో ప్రచురించిన అంశాల్లో వీటిని వివరించారు. ఇక మిరియాలు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడగలవని చెప్పేందుకు కూడా పలు ఆధారాలు ఉన్నాయి.

* పచ్చి ఆలివ్ నూనెను వాసన చూడటం వల్ల కూడా బరువు తగ్గొచ్చని పలు అధ్‌యయనాల్లో వెల్లడైంది. దీంతో బ్లడ్‌ షుగర్ లెవల్స్‌ కూడా కంట్రోల్‌లోకి వచ్చినట్లు నిపుణులు గుర్తించారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..